ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం కష్టమే!

ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి. వైసీపీకి కడప, కర్నూలు, […]

కుప్పం సరే..ఆ ఎమ్మెల్యేతోనే కష్టం!

మరి జనంలో తమకు బలం ఎక్కువ ఉందని అనుకుంటున్నారో లేక…తమ పథకాలే తమని గెలిపిస్తాయనే కాన్ఫిడెన్స్ కావొచ్చు..వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా పనిచేయడం కూడా మొదలుపెట్టారు. మనం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని అడుగుతున్నారు…ఆఖరికి కుప్పంలో కూడా పైచేయి సాధించాం కదా…ఇంకా 175 గెలుచేసుకోవచ్చన్నట్లే జగన్ మాట్లాడుతున్నారు. జగన్ అన్నది కరెక్టే…కుప్పంలో కూడా వైసీపీనే పైచేయి సాధించింది..పంచాయితీ, […]

సొంత గడ్డలో ‘సైకిల్’కు కష్టాలు?

2019 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయనే చెప్పొచ్చు..ఎప్పుడైతే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైందో అప్పటినుంచి సైకిల్ కు కష్టాలు పెరుగుతూ వచ్చాయి. పైగా అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. అయితే ఎన్నికలయ్యి మూడేళ్లు దాటిన సరే టీడీపీకి కష్టాలు తొలగినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో బలపడి ఉంటే… టీడీపీకి ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదని చెప్పొచ్చు. కానీ ఆ […]

వైసీపీ ఆప‌రేష‌న్ కుప్పంలో ఇంత క‌థ న‌డుస్తుందా… బాబు ఏం చేస్తారో…!

ఏది అనుకుంటే.. దానిని సాధించ‌డం అల‌వాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబంధించి రెండు కీల‌క విష‌యాల‌పై నిర్దిష్ట‌మైన ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఒక‌టి మ‌రోసారి అధికారం లోకి రావ‌డం.దీనికి సంబంధించి.. ఆయ‌న ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ప్ర‌తి ఒక్క‌రినీ ముందుకు న‌డిపిస్తున్నారు. తాను కూడా త్వ‌రలోనే జిల్లాల యాత్ర చేయ‌నున్నారు. ఇక‌, రెండోది.. ప్ర‌తిప‌క్ష నాయ‌కు డు చంద్ర‌బాబును రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డం. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు గ‌డిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]

అందుకే బాబు కుప్పం టూర్..

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలు పెడితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ ప్రాభవం కోల్పోయింది. అధికార వైసీపీ వైపే జనం మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ముందనుంచీ కుప్పంలో టీడీపీ పాగా వేసింది. చంద్రబాబు నాయుడు అంటే కుప్పం గుర్తుకొస్తుంది. అటువంటి కుప్పం ఇపుడు ఫ్యాను కింద […]

చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ కు సీఎం పీఠం అప్పగించిన చంద్రబాబు .. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలను వైసీపీకి కోల్పోయాడు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే హవా అయింది. సరే.. వారు అధికారంలోఉన్నారు.. కాబట్టి వైసీపీదే పైచేయి అవుతుందని అనుకోవచ్చు. మరి టీడీపీ కంచుకోటలు వైసీపీ దెబ్బకు బద్దలవుతున్నాయంటే టీడీపీ […]

సీఎం ఎన్టీఆర్.. బాబు ఇలాకాలో పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను చూసి ఇతర స్టార్ హీరోలు సైతం అవాక్కవుతంటారు. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు దుర్భాషలాడటంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. అటు తమ ఇంటి ఆడపడుచును రాజకీయాల్లోకి లాగడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా […]

పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో […]

బాబు ప్రాభవానికి గండికొట్టే ఎన్నికలివి!

కుప్పం మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రాభవానికి గండి పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. 25 వార్డులు ఉన్న కుప్పం మునిసిపాలిటీలో- 15 వార్డుల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందగలరా అనేది కూడా ప్రశ్నార్థకమే అవుతుంది! తన సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గం తనను తిరస్కరించిన తర్వాత.. చంద్రబాబు జిల్లాకు ఒక మూలగా […]