సీఎంగా జ‌య జీతం ఎంతో తెలుసా…ఇదీ ఓ రికార్డు

ప్ర‌భుత్వాధినేత‌లంటే వారి జీతాలు ల‌క్ష‌ల్లోనే ఉంటాయి. వారు ఎప్ప‌టిక‌ప్పుడు శాస‌న‌స‌భ‌లు, లోక్‌స‌భ‌ల్లో తీర్మానాలు చేయించుకుని మ‌రీ జీతాలు పెంచేసుకుంటారు. వారికి అన్నింట్లోను రాయితీలు ఉన్నా జీతాలు మాత్రం స‌రిపోవ‌ట‌. వీరి లెక్క ఎలా ఉన్నా త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మాత్రం ఈ విష‌యంలో ఎంతో ఉన్న‌త‌మైన వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నారు. ఆమె సీఎంగా ప‌నిచేసిన‌న్ని రోజులు ఆమె నెల‌కు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే జీతం తీసుకున్నారు. ఆమె సీఎం అయిన తొలినాళ్ల‌లో త‌న‌కు జీత‌మే వ‌ద్ద‌ని […]

అన్నాడీఎంకేలో మూడు కుంప‌ట్లు

త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆసక్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయా?  అధినేత్రి అమ్మ మ‌ర‌ణంతో పార్టీలో అధికారమే కేంద్రంగా విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుందా?  జ‌య‌కు అనుచ‌రులుగా ఉన్న ముగ్గురు వ్య‌క్తులు ప్ర‌ధానంగా పార్టీలో చ‌క్రం తిప్ప‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. త‌మిళ‌నాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య మ‌ర‌ణంతో రాష్ట్ర అధికార పార్టీని ఎవ‌రు లీడ్ చేస్తార‌నే ప్ర‌శ్న సాధార‌ణంగా ఉద‌యించేదే. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున ఈ విష‌యంపై చ‌ర్చ జ‌రిగింది. జ‌య […]

అన్నాడీఎంకేను క‌బ్జా చేసే ప‌నిలో బీజేపీ

ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ రాజ‌కీయాల్లో త‌మిళ‌నాడు హ‌వా కొన‌సాగుతూ వ‌స్తోంది. 39 లోక్‌స‌భ స్థానాలతో దేశంలోనే ఎక్కువ ఎంపీ స్థానాలు క‌లిగిన రాష్ట్రంగా ఉన్న త‌మిళ‌నాడు జాతీయ రాజ‌కీయాల‌ను ఎప్పుడూ శాసిస్తూ వ‌స్తోంది. రాజీవ్‌గాంధీ చ‌నిపోయిన‌ప్పుడు ఇదే జ‌య‌లలిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అక్క‌డ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసింది. త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-డీఎంకేలు పొత్తు పెట్టుకుని గ‌ణ‌నీయ‌మైన సీట్లు సాధించాయి. ఇదే జ‌య‌ల‌లిత మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుని వాజ్‌పేయ్ ప్ర‌భుత్వం ప‌డిపోయేందుకు కార‌ణ‌మ‌య్యారు. […]

జ‌య వార‌సుడిగా తెలుగోడు

త‌మిళ‌నాడు సీఎం, పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత మృతి త‌మిళ‌నాట అన్నాడీఎంకే రాజ‌కీయాల‌ను కాస్త సంక్షోభంలో ప‌డేసింది. ప్ర‌స్తుతానికి అమ్మ‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్న మాజీ సీఎం ప‌న్నీరుసెల్వం మ‌రోసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టినా, భ‌విష్య‌త్తులో అన్నాడీఎంకే ప‌గ్గాలు ఎవ‌రు చేప‌డ‌తారు ? ఈ ప్ర‌శ్న‌కు జ‌య‌ల‌లిత తాను చ‌నిపోక ముందే ఆన్స‌ర్ రెడీ చేసిన‌ట్టు అన్నాడీఎంకే వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జ‌య‌ల‌లిత త‌ర్వాత అన్నాడీఎంకే ప‌గ్గాల కోసం ప‌న్నీరు సెల్వంతో పాటు సెల్వ రాజ‌న్‌, అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ పేర్లు […]

జ‌య‌ల‌లిత హెల్త్ బులిటెన్ ఏం చెపుతోంది…

త‌మిళ‌నాడు సీఎం, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు అమ్మ జ‌యరామ‌న్ జ‌య‌ల‌లిత‌.. ఆరోగ్యం ఇంకా విష‌మంగానే ఉన్న‌ట్టు చెన్నైలోని అపోలో వైద్యులు ప్ర‌క‌టించారు. రెండు నెల‌ల కిందట సెప్టెంబ‌రు 22న తీవ్ర జ్వ‌రం ఇన్‌ఫెక్ష‌న్‌తో ఆస్ప‌త్రిలో చేరిన ఆమె ఆరోగ్యంపై అప్ప‌ట్లోనే వ‌దంతులు వ‌చ్చాయి. అయితే, సంపూర్ణ ప్ర‌త్యేక వైద్యంతో ఆమె కోలుకున్న‌ట్టు వైద్యులు తెలిపారు. ఇటీవ‌లే ఆమె రెండు మూడు రోజుల్లోనే ఇంటికి(పోయెస్ గార్డెన్‌) వ‌చ్చేస్తార‌ని కూడా అన్నాడీఎంకే నేత‌లు ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని అపోలో వైద్యులు […]

జ‌య రిటైర్డ్‌..!

అవును! మీరు చ‌దివింది నిజ‌మే! త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌, త‌మిళ ప్ర‌జ‌ల అమ్మ రిటైర్డ్ అయ్యారు. ఆమెను విధుల నుంచి పూర్తిగా రిలీవ్ చేస్తున్న‌ట్టు ప్ర‌త్య‌క్షంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావు ప్ర‌క‌టించ‌క పోయిన‌ప్ప‌టికీ.. ఆమె చూస్తున్న అన్ని శాఖ‌ల‌నూ ఆర్థిక మంత్రి ప‌న్నీర్ సెల్వానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జ‌య ఒక‌రకంగా త‌న విధుల నుంచి రిటైర్డ్ అయిన‌ట్టే క‌దా!! అయితే, ఆమె సీఎంగా మాత్రం కొన‌సాగుతారు. పురుచ్చితలైవిగా పూజ‌లందుకునే ఒక‌ప్ప‌టి సినీ […]

కొత్త సీఎం కోసం ట్ర‌యాంగిల్ ఫైట్‌

త‌మిళ‌నాడుకు కొత్త సీఎం రానున్నారా? జ‌య ఆరోగ్య ప‌రిస్థితి నేప‌థ్యంలో సీఎం పీఠంపై మ‌రొక‌రు కూర్చోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందా? ఈ క్ర‌మంలో స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దాదాపు 20 రోజుల‌కు పైగా సీఎం జ‌య ల‌లిత అనారోగ్యంతో ఆస్ప‌త్రికే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో రాష్ట్ర పాల‌న‌ను ఆమె గౌర‌వ స‌ల‌హాదారు రిటైర్డ్ ఐఏఎస్ బాల కిష‌న్ చూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పూర్తిస్థాయిలో పాల‌న జ‌ర‌గ‌డం లేదు. మ‌రో ప‌క్క‌జ‌య మ‌రో నెల వ‌ర‌కు ఆస్ప‌త్రిలోనే ఉండాల్సి […]

త‌మిళ‌నాడు అమ్మ వార‌సుడిగా ఆ స్టార్ హీరో

త‌మిళ‌నాడులో అమ్మ‌కు ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే అమ్మ వార‌సుడు ఎవ‌రు ?  ఇప్పుడు ఇదే అంశంపై అక్క‌డ మీడియాలో ఎడ‌తెగ‌లేని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్నాడీఎంకేను గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా తిరుగులేని శ‌క్తిగా న‌డిపిస్తున్న పురుచ్చిత‌లైవి, అమ్మ జ‌య‌ల‌లిత న‌డిపిస్తున్నాయి. అయితే వారం రోజులుగా అమ్మ ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల ఊహానాలు వెలువ‌డుతున్నాయి. అమ్మ కోలుకుంటే అంతా క్షేమం…లేనిప‌క్షంలో అమ్మ వార‌సుడు ఎవ‌రు అన్న‌దే ఇప్పుడు ఇక్క‌డ పెద్ద ఆన్స‌ర్‌లేని ప్ర‌శ్నగా మిగిలిపోయింది.  ఎంజీఆర్ మరణానంతరం జయలలిత 1989 లో […]

ఆవిడ‌.. అమ్మ లోటు తీరుస్తోందా?

అమ్మ లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేర‌ని అంటారు! ఇది క‌న్న‌త‌ల్లి విష‌యంలో! కానీ, త‌మిళ‌నాడులో మాత్రం అక్క‌డి జ‌నాల‌కి క‌న్న‌త‌ల్లి క‌న్నా పాలిస్తున్న త‌ల్లి, పురుచ్చిత‌లైవి అయిన జ‌య ల‌లిత అంటే పంచ ప్రాణాలు. అమ్మ క‌నుస‌గైలే ఆదేశాలు, అమ్మ పలుకులే ఆణిముత్యాలు! అమ్మ కోసం ఏమైనా చేస్తాం అనేవారు స్టేట్‌లో స‌గానికిపైగా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అమ్మ కోసం గుడులు, అమ్మ‌కోసం పూజ‌లు, అంతెందుకు అమ్మ‌కే పూజ‌లు! త‌మిళ‌నాట అమ్మంటే జ‌యే!! అందుకే స్టేట్ పొలిటిక‌ల్ […]