కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?

గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని […]

పవన్-బాబు…వాళ్ళకు భలే హ్యాండ్ ఇచ్చారే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికి ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే…ఒకప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ…రాజకీయంగా కూడా బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేని స్థ్తితిలో ఉన్నారు. పైగా కమ్యూనిస్టులని ఎవరికి వారు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. ఏపీలో కమ్యూనిస్టుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. మొదట్లో ఉమ్మడి ఏపీలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలు టీడీపీతో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లలో గెలిచేవి. 2004లో కాంగ్రెస్, మళ్ళీ […]

సర్వేలు వచ్చిన బాబు పట్టించుకోవట్లేదే!

ఇటీవల పలు నేషనల్ సర్వేలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పిన విషయం తెలిసిందే…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని జాతీయ మీడియా సర్వేల్లో తేలింది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఆ మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం…వైసీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి 6, ఇండియా టుడే సర్వే ప్రకారం…వైసీపీకి 18, టీడీపీకి 7, టైమ్స్ నౌ ప్రకారం…వైసీపీ 17-23 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పింది. ఓవరాల్ గా చూస్తుంటే […]

ఎన్టీఆర్ ‘టీడీపీ’..కొడాలి జోస్యం!

ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. […]

కుప్పం కొట్లాట..డ్యామేజ్ ఎవరికి?

సాధారణంగా కుప్పం నియోజకవర్గం పెద్దగా హైలైట్ కాదు…ఏదో రాష్ట్రం చివరిన ఉండే కుప్పంలో రాజకీయంగా గొడవలు జరిగినట్లు ఎప్పుడు మీడియాలో రాలేదు. అది బాబు…సొంత స్థానమని, అక్కడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించే మీడియాలో వచ్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ రాజకీయం మారిపోయింది. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలనే దిశగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దూకుడుగా […]

కుప్పం పంచాయితీ…బాబుకు వైసీపీనే ప్లస్!

అవును వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుంది…వరుసగా పంచాయితీ, పరిషత్..ఆఖరికి టీడీపీ కంచుకోటగా ఉండే కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది…ఇలా వైసీపీ వరుసగా సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని చూస్తుంది. అయితే ఇలా వైసీపీ విజయాలు..వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన బాబుని భయపెట్టాయి. అసలు నామినేషన్ వేయడానికే వెళ్లని బాబు…రెండు నెలలకొకసారి కుప్పం వెళ్ళేలా చేశాయి. ఇక ఈ సీన్ చూసి వైసీపీ నేతలు సెటైర్లు […]

కొడాలి లాజిక్: తారక్‌తో జగన్‌కే ప్లస్?

గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా-సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ చుట్టూ రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కేవలం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటన నచ్చి…ఎన్టీఆర్‌ని షా అభినందించడానికే భేటీ అయ్యారని బీజేపీ, టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నారు…అలాగే దర్శకుడు రాజమౌళి ఉన్నారు..మరి వాళ్ళని ఎందుక ప్రశంసించలేదని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ ఎవరి […]

మంత్రుల తెలివి..జగన్‌కే డేంజర్ ?

ఏపీలో మంత్రులు…తమ తమ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియడం లేదు గాని…ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి…చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం మాత్రం తెలుస్తోంది. మంత్రులు అంటే ప్రతిపక్ష నాయకులని తిట్టడానికే ఉన్నారా? అనే డౌట్ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రులు టార్గెట్ కేవలం..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకూడదనే కాన్సెప్ట్‌లోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేయడానికి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు మంత్రులు ప్రత్యేకంగా పవన్‌ని టార్గెట్ చేసి […]

బాబు ఫిక్స్: ఆ ఇంచార్జ్‌లు అవుట్..?

టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే…పార్టీలో భారీ మార్పులు జరగాల్సిందే…పనిచేస్తున్నట్లు హడావిడి చేస్తున్న నేతలలని పక్కన పెట్టాల్సిందే…అలాగే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇస్తే వైసీపీని ఢీకొట్టడం సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే దిశగా అధినేత చంద్రబాబు సైతం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఏదో మొహమాటం కొద్ది నేతలకు ఛాన్స్ ఇస్తే…టీడీపీకే నష్టం జరిగేలా ఉంది. ఈ సారి పనిచేయని నేతలని ఏ మాత్రం ఉపేక్షించే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు వరుసపెట్టి […]