సాధారణంగా కుప్పం నియోజకవర్గం పెద్దగా హైలైట్ కాదు…ఏదో రాష్ట్రం చివరిన ఉండే కుప్పంలో రాజకీయంగా గొడవలు జరిగినట్లు ఎప్పుడు మీడియాలో రాలేదు. అది బాబు…సొంత స్థానమని, అక్కడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించే మీడియాలో వచ్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ రాజకీయం మారిపోయింది.
ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలనే దిశగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టాయి. అయితే బాబు అలెర్ట్ గా లేకపోవడం వల్ల కుప్పంలో వైసీపీ హవా పెరిగింది..వరుసపెట్టి పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంది. ఇక కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకుంది.
ఇక్కడ నుంచి బాబుకు జ్ఞానోదయం అయింది…ఇంకా అలెర్ట్ గా లేకపోతే కుప్పం అసెంబ్లీలో కూడా గెలవడం కష్టమని బాబుకు అర్ధమైంది..అందుకే మూడు నెలకొకసారి కుప్పం వెళ్ళి..అక్కడ పరిస్తితులని తెలుసుకుని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇక తాజాగా కూడా కుప్పంకు వెళ్లారు. అయితే ఈ సారి బాబు టూర్ పెద్ద రచ్చగా మారింది. మొదటి రోజు టూర్‌లో బాబుకు వ్యతిరేకంగా వైసీపే శ్రేణులు హల్చల్ చేశాయి. వైసీపీ బ్యానర్లు కట్టారు…అలాగే జై జగన్ అంటూ నినాదాలు ఇచ్చారు. ఇదే క్రమంలో టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించడంతో…రెండు వర్గాల మధ్య రచ్చ జరిగింది.
ఇక రెండో రోజు అధికార వైసీపీ డామినేషన్ పూర్తిగా కనిపించింది…అనూహ్యంగా టీడీపీ ఫ్లెక్సీలు చింపేయడం…అన్నా క్యాంటీన్‌ని ధ్వంసం చేయడం…టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం చేశారు. దీనికి టీడీపీ శ్రేణులు గట్టిగానే స్పందించారు…కానీ పోలీసులు టీడీపీ శ్రేణులని నిలువరించారు. అయితే వైసీపీ శ్రేణులని నిలువరించడంలో పోలీసులు కాస్త ఉదాసీనత ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా గాని కుప్పంలో పెద్ద రచ్చ జరిగింది. ఈ రచ్చలో ఎవరికి రాజకీయంగా డ్యామేజ్ జరుగుతుందో ప్రజలే డిసైడ్ చేయొచ్చు. ఇందులో ఎక్కువ శాతం వైసీపీ రచ్చ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మామూలుగా అయితే బాబు తన కార్యక్రమాలు చూసుకుని వెళ్ళిపోయారు…కానీ వైసీపీ కావాలని బాబు టూర్‌కు బ్రేకులు వేయాలని చూడటంతోనే ఇదంతా జరిగిందని అర్ధమవుతుంది. ఏదేమైనా ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల ఇటు వైసీపీకి మైలేజ్ పెరగదు…అలాగే టీడీపీకి ఒరిగేది ఏమి ఉండదు.