టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా నిన్నటి రోజున గ్రాండ్ గా విడుదల అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి కూడా చాలా దారుణంగా నెగిటివ్ స్పందన లభించినట్లు సమాచారం. సినిమా అసలు ఏమాత్రం బాగాలేదని సినీ ప్రేక్షకుల సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ పైన కోపమున్న సెలబ్రిటీలు సైతం తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరుగుతోంది.ఇప్పటికే యాంకర్ అనసూయ విజయ్ దేవరకొండ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది. ఇక అందులో ఆమె విజయ్ దేవరకొండ పేరు గాని లైగర్ సినిమా పేరు గాని ఎక్కడ ప్రస్తావించలేదు కానీ గతంలో వీరిద్దరికి జరిగిన కొన్ని గొడవల వల్ల ఇమే ఇలా చేసింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా నటి శ్రీరెడ్డి కూడా పూరి జగన్నాథ్ ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేయడం జరిగింది.. ఇక ఆ కామెంట్లలో.. ఆమె రాసుకు వచ్చింది ఏమిటంటే.. తీసేది ఏమో అట్టర్ ప్లాప్ సినిమాలు.. మరల మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వడం లేదు అని బాబు మీద పడి ఏడవడం ఎంతవరకు కరెక్టే అధ్యక్ష ?అంటూ ఆమె కామెంట్లు చేసింది.గతంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే పూరి కూడా గతంలో మహేష్ బాబు హిట్లు ఉన్న డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తారని.. ఇతర డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వారని కామెంట్స్ చేశారు.. వాటిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి ఆయనకు ఇప్పుడు ఘాటు కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక లైగర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు అంత హైప్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికంటే కార్తికేయ-2 సినిమానే బెటర్ అని కూడా కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/MsSriReddy/status/1562718008250105857?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1562718008250105857%7Ctwgr%5E23e0268223284868e78e9ea8a90e9cb9ecdfff09%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fcdn.embedly.com%2Fwidgets%2Fmedia.html%3Ftype%3Dtext2Fhtmlkey%3Dcb7145f1731b4c328f8e4d2201854ceaschema%3Dtwitterurl%3Dhttps3A%2F%2Ftwitter.com%2Fmssrireddy%2Fstatus%2F1562718008250105857image%3Dhttps3A%2F%2Fabs.twimg.com%2Ferrors%2Flogo46x38.png