`ముంద‌స్తు` ముందు బాబుకు స‌వాళ్లు

ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టినుంచే శ్రేణుల‌ను అల‌ర్ట్ చేస్తున్నారు. పైకి మాట‌లు గ‌ట్టిగా చెబుతున్నా.. ఆయ‌న‌లోనూ ముంద‌స్తు బెంగ ఉంద‌ని పార్టీ నేత‌లు అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఒక‌పక్క రాష్ట్రంలో నివురు గ‌ప్పిన నిప్పులా ప్ర‌జల్లో అసంతృప్తి, మ‌రో ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స్ప‌ష్ట‌మైన క్లారిటీ రాక‌పోవ‌డం.. వీట‌న్నింటికీ మించి అచ్చిరాని `ముంద‌స్తు ఎన్నిక‌ల‌` సెంటిమెంట్‌.. ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య ఎన్నిక‌ల‌కు వెళితే ఎలా నెగ్గుకురావాల‌నే బెంగ […]

చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్‌… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు

అన్న ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే నానుడి ఎంతో సుప‌రిచితం!!  ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్ర‌బాబు.. ఆఖ‌రుకి తన క్యాబినెట్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో పాత‌, కొత్తవారితో క‌లిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా ప‌ద‌వి పొందిన వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. అలాగే త‌మ ప‌ద‌వి ప‌దిలమైనందుకు కొంత‌మంది సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ ఆనందం, సంబ‌రం కొద్ది గంటల్లోనే ఆవిరి […]

ఏపీ మునిసిప‌ల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు

ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డుల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ స‌త్తా చాటింది. టీడీపీ జోరుకు విప‌క్ష వైసీపీ బేజార‌య్యింది. కీల‌క జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ‌ప‌ట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో ప‌లు వార్డుల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ్డాయి. ఒక్క వార్డులో మిన‌హా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు […]

టీడీపీలో సీనియర్లపై బాబుకు నమ్మకం లేదా..!

ఒక‌ప్పుడు తెలుగుదేశం అంటే న‌మ్మ‌కానికి, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు..త‌ర్వాత చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్పుడు టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ నూటికి నూరుశాతం ఉండేది. పార్టీ నిర్ణ‌యాన్ని ఎవ్వ‌రూ వ్య‌తిరేకించే వారు కాదు. అధ‌ధినేత చెప్పిందే వేదం. అయితే ఇప్పుడు తెలుగుదేశం సీన్ మారింది. క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేసింది. పార్టీలోనే ఒక‌రికి ఒక‌రికి ప‌డ‌డం లేదు. జిల్లాల్లో కాదు ఇంకా చెప్పాలంటే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గ్రూపు రాజ‌కీయాలు ఓ రేంజ్‌లో రాజ్య‌మేలుతున్నాయి. ఇక ఇప్పుడు పార్టీలో చంద్ర‌బాబునే […]

ఎమ్మెల్సీ ఫలితాలతో చంద్రబాబులో మార్పు

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విజ‌యంతో తెదేపా శ్రేణులు ఆకాశంలో తేలుతున్నాయి. అధికారం, డబ్బు ప్ర‌వాహం అధికంగా ప్ర‌భావం చూపిన ఈ ఎన్నిక‌ల్లో మూడు స్థానాల‌ను కైవసం చేసుకోవ‌డంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు అండ్ కో ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. రెండో వైపు పార్టీ శ్రేణులు మాత్రం ఈ విజ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వెయ్యి ఓట్లు పోలైతే కేవలం ముప్పయి ఓట్ల మెజార్టీతో గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా…? అందులో […]

విప‌క్షాల‌కు చిక్కిన టీడీపీ, టీఆర్ఎస్‌ .. సెల్ఫ్ డిఫెన్స్‌లో పార్టీలు

ఇరు తెలుగు రాష్ట్రాల‌ అసెంబ్లీ స‌మావేశాల్లో  పూర్తి ఆధిప‌త్యం చెలాయిస్తున్న అధికార ప‌క్షాలు.. చివ‌ర‌కు విప‌క్షాల చేతికి చిక్కాయి! తెలంగాణ‌తో పోల్చితే ఏపీలో బ‌ల‌మైన విపక్షం ఉన్నా.. అందుకు దీటుగా టీడీపీ నేత‌లు స‌మాధానం చెబుతున్నారు. అలాగే తెలంగాణ‌లో.. గొంతు విప్పి.. విమర్శ చేసే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని తెలంగాణ ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని.. సభలో హడావిడి చేయలేని పరిస్థితి. త‌మ అధికారంతో గొంతు నొక్కేసిన అధికార ప‌క్షాలు ఇప్పుడు […]

బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన […]

కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు … ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు త‌న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఉగాది, శాస‌న‌స‌భ, మండ‌లి స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 6వ తేదీన కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఐదుగురు మంత్రుల‌కు ఖచ్చితంగా ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న టాక్ ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ  అవుట్ లిస్టులో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌, విజ‌య‌న‌గ‌రం […]

ఆ పదవులు బాబుకు కలిసిరావా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కేరీర్‌లో డిప్యూటీ, ఉప ప‌ద‌వులు క‌లిసి రాన‌ట్టే క‌న‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కేరీర్‌ను విశ్లేషిస్తే ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు డిప్యూటీ, ఉప ప‌దువుల ఇచ్చిన వాళ్లు కీల‌క టైంలో ఆయ‌న్ను న‌మ్మించి దెబ్బేశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ. కృష్ణ‌మూర్తి ఎమ్మెల్సీ విష‌యంలో బాబు మీద అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. దీంతో బాబుకు డిప్యూటీ, ఉప ప‌ద‌వులు క‌లిసిరావ‌న్న చ‌ర్చ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. 1995-2004 […]