ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత.. ఏపీ రాజకీయ చిత్రంలో అనేక మార్పులు జరిగే వాతావరణం కనిపిస్తోంది. ఎవరు ఎవరికి మిత్రులు అవుతారో.. మరెవరు శత్రువులవుతారో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విషయంలో టీడీపీ నాయకులు, టీడీపీతో వ్యవహరించే విషయంలో బీజేపీ నాయకుల్లోనూ కొంత మార్పు వచ్చినట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్తరించాలని బీజేపీ నాయకులు తహతహలాడుతున్నారు. విస్తరణకు ఇదే సరైన సమయమని పార్టీ పెద్దలకు చెబుతున్నారు. ఇదే […]
Tag: bjp
చిదంబరం ఏంటి.. బీజేపీలో చేరడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా!!
తమిళనాడుపై పట్టు సాధించాలనే ఆశ బీజేపీలో ఇంకా కనిపిస్తూనే ఉంది. మాజీ సీఎం దివంగత జయలలిత మరణం తర్వాత.. ఆమె విధేయుడైన పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చి ఎన్నో ఆటలు ఆడించింది. ఆయన్ను ముందుంచి వెనుక నుంచి చక్రం తిప్పుదామని కలలుగంది. చివరకు సీఎం పీఠం ఎక్కుదామని భంగపడిన శశికళ వర్గానికే సీఎం కుర్చీ దక్కింది. దీంతో ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న ఆశ ఆవిరైంది. అయితే ఇప్పుడు చేరికలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ […]
రోజాకు ఏమైనా ప్రత్యేక రూల్స్.. చట్టాలు ఉన్నాయా?
కొత్త అసెంబ్లీలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమామహేశ్వరావు.. మధ్య గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గొడవపై విచారణ కొలిక్కి వచ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించడం, తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇవన్నీ పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అనడంపై బోండా ఉమామహేశ్వరరావు […]
ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్
ఒక్క విజయం ఎంతోమందికి సమాధానం చెబుతోంది. ఒక్క విజయం ఎన్నో సందేహాలకు కారణమవుతోంది. ఒక్క విజయం.. నాయకుడిని శక్తిగా నిలిపింది!! ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ విజయం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మాత్రం తలకిందులయ్యాయి! 2014 ఎన్నికల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని తుంగలో తొక్కారు! దక్షిణాదిలో ఏపీపై పట్టు సాధించాలని.. రాష్ట్రానికి […]
యూపీ ఎఫెక్ట్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు
యూపీ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాలపై ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు దేశమంతా మొదలైంది. ప్రధాని మోదీని ఢీ కొట్టడం ఇక అసాధ్యమన్న విషయం ఈ ఫలితాలతో తేలిపోయింది. అందుకే ఇప్పటినుంచే తమ వ్యూహాలు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు నాయకులు. ముఖ్యంగా దూరదృష్టిగల తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఇప్పుడు యూపీ ప్రభావం పడింది. అందుకే సంచలన నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా మోదీ హవా.. తెలంగాణ రాష్ట్రంపై పడకుండా ఉండేందుకు పక్కా వ్యూహంతో దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ఎన్నికల వ్యూహానికి […]
మోదీ-షా తదుపరి లక్ష్యం కేసీఆరేనా?
`నెక్ట్స్ ఏంటి?` ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కాషాయ దళం ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని.. తమ తదుపరి లక్ష్యంగా చేసుకుంటోంది? ఉత్తర ప్రదేశ్‌లో సంచలన విజయం తర్వాత.. ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? అని అన్ని రాష్ట్రాల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు! అయితే తదుపరి లక్ష్యాన్ని కూడా బీజేపీ సెట్ చేసుకుందట. దక్షిణాదిలో బలపడేందుకు వీలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు తమ టార్గెట్‌గా ఎంచుకుందని సమాచారం. ఇప్పటికే కార్యకర్తలకు అధిష్ఠానం నుంచి స్పష్టమైన […]
యూపీలో గెలుపెవరిది? బెట్టింగుల జోరు!
దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్రస్తుతం ఐదు దశల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మట్టమవుతుంది? ప్రధాని మోడీ హవా ఏ మేరకు పనిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వంటి విషయాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్లలో సాగుతుండడంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే పడింది. […]
పన్నీర్ సీఎం అయితే బీజేపీదే అధికారమా?
దక్షిణాది రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం పరితపిస్తున్న బీజేపీకి తమిళనాడు ద్వారా ఆ అవకాశం దక్కిందా? ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న సంక్షోభంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం పైకి చెబుతున్నా.. రిమోట్ కంట్రోల్ మాత్రం తన దగ్గరే ఉంచుకోబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా గవర్నర్ విద్యాసాగర రావు ద్వారా పావులు నడిపిస్తోంది కేంద్ర నాయకత్వం! అమ్మకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చి తెర వెనుక చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోంది. మరి హస్తిన ఆధిపత్యాన్నితమిళులు […]
బ్రేకింగ్: టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది! రాష్ట్రం విడిపోయాక తీవ్రంగా నష్టపోయింది టీడీపీనే! అలాగే ఇప్పటికే మినీ తెలుగుదేశంలా టీఆర్ఎస్ మారిపోయిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఓటుకు నోటు వ్యవహారం బయటపడిన దగ్గర నుంచి టీఆర్ఎస్-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితి మారిపోయింది, మరి ఉప్పు నిప్పు లాంటి పార్టీలు రెండూ కలిసి పనిచేస్తాయని కలలో కూడా ఊహించలేం కదా! కానీ ఇప్పుడు ఇలాంటి పరిణామాలు రాబోతున్నాయట! వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ – టీడీపీతో బీజేపీ […]