రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. తాననుకున్నది కచ్చితంగా చేసే మనస్తత్వం..అతి సాధారణమైన జీవితం.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా ఆమె వెరీ సింపుల్..రాజకీయంగా ఎవ్వరితోనైనా ఢీ అంటే ఢీ అంటారు.. అవతల మోదీ ఉన్నా.. సోనియా ఉన్నా.. డోంట్ కేర్.. ఆమే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన రాజకీయ యోధురాలు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీని […]
Tag: bjp
ఆలూ..లేదు.. చూలూ లేదు..
బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంలో ఉన్నట్టున్నాడు.. ఎంత ఉత్సాహమంటే.. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికలు జరిగినట్లు.. ఫలితాలు వచ్చినట్లు.. బీజేపీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్నంటు.. కమలం నాయకులు ఇంకా ఓ అడుగు ముందుకేసి తొలి సంతకం ఉచిత విద్యపై చేస్తామని చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది..అయితే బీజేపీ మాత్రం ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాదులో రెండు రోజుల పాటు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆ […]
మోదీసాబ్.. అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే..
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీ తాను అనుకున్నది అనుకున్నట్లు కచ్చితంగా అమలు చేసి తీరతారు. ప్లాన్ పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పెద్దటీమ్ ఉంది. మోదీకి ఏదైనా ఆలోచన వస్తే చాలు.. దాని అమలుకు ఈ టీమ్ సర్వశక్తులు వడ్డుతుంది. సోషల్ మీడియాలోనూ అంతే.. మోదీ ఫాలోయింగ్‌ను ఈ టీమ్ ఓ రేంజ్‌లో పెంచుతుంది. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ […]
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు…
తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మీరలా చేశారు.. వారలా చేశారు.. అనుకుంటూ కాలం గడుపుతున్నారు. అసలే రైతులు వరి కొనుగోలు సమస్యతో ప్రాణాలు కోల్పోతుంటే ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి మానాన వారు చేశామంటే.. చేశామని నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నగరంలో ప్రారంభమయ్యాయి. బీజేపీ అగ్రనాయకుడు, […]
తెరాస,కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ మైండ్ గేమ్..!
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన తరువాత కాస్త వేగంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. వరి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. జీహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహించడం లేదని నిన్న ఆందోళనలు చేస్తూ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని 3 నుంచి 30 వరకు.. వీలైతే అధికారం చేజిక్కించుకునేంతవరకు పోరాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశాలు […]
కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..
వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం) […]
చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే
‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]
ఆ స్వతంత్రులకు సపోర్ట్ ఇస్తున్నదెవరో?
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో అధికార పార్టీకి ఏ ఇబ్బందీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తలనొప్పిగా మారనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నది 12 స్థానాలు. 12 సీట్లకు గాను 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు బరిలోకి దిగారు. అసలు విషయమేమంటే.. 12 సీట్లకు గాను 102 మంది నామినేషన్లు ఫైల్ చేయడంతో […]
కమలం.. ఇక కుల సమీకరణలు..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఊహించని విజయం.. అసెంబ్లీలో ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో పట్టు పెంచుకునే యత్నం.. అధికారంలోకి కాకపోయినా కనీసం 30..40 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని టీబీజేపీ నాయకులు ప్లాన్ రూపొందిస్తున్నారు. వారికి హై కమాండ్ కూడా ఫుల్ సపోర్టు ఉంది. బండి సంజయ్ దూసుకుపోతున్నాడు. దీంతో పొలిటికల్ లీటర్లు కులసమీకరణలపై ద్రుష్టి సారించారు. ముఖ్యంగా మున్నూరుకాపు, ముదిరాజ్, రెడ్డి, ఎస్టీల ఓట్లు రాబట్టుకునేందుకు, వారి మద్దతు కూడబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. 2023 ఎన్నికలే […]