బందరులో బాబు జోరు..కొల్లుకు డౌట్ లేనట్లే?

గతేడాది కాలం నుంచి టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు జనం మద్ధతు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలని నిర్వహిస్తూ..దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎక్కడకు వెళ్ళిన బాబు  రోడ్ షోలకు భారీ ఎత్తున జనం వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మచిలీపట్నంకు బాబు వెళ్లారు. జనం మద్దతు ఊహించని స్థాయిలో వచ్చింది. అసలు మచిలీపట్నంలో రోడ్ షో ద్వారా మీటింగ్ పెట్టాల్సిన సమయం […]

వెస్ట్‌లో ఆ సీట్లలో తమ్ముళ్ళ పోరు..బాబు సెట్ చేయరా?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధులని చంద్రబాబు ఇప్పటినుంచే రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించి ఇబ్బందులు పడకుండా..ఇప్పుడు ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. అయితే ఇంకా కొన్ని సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ కావాలి. ఇదే సమయంలో టి‌డి‌పికి బలం ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా వరకు అభ్యర్ధులు ఖరారు […]

కృష్ణాలో బాబు ఎంట్రీ..టీడీపీ దశ తిరుగుతుందా?

గత ఏడాది నుంచి బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో భాగంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ప్రతి చోట మూడు నియోజకవర్గాల్లో బాబు రోడ్ షోలు, సభలు పెడుతున్నారు. ఈ సభలు భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత బాబు మళ్ళీ ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాబు పర్యటిస్తున్నారు. మచిలీపట్నం, […]

తాడిపత్రి సీటు మళ్ళీ జేసీ తనయుడుకే..లోకేష్ క్లారిటీ?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అభర్ధులపై ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా సరే గతానికి భిన్నంగా చంద్రబాబు సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఈ సారి మొహమాటం పడకుండా..పనిచేయని వారికి సీట్లు లేవని చెప్పేస్తున్నారు. ఇక బలమైన అభ్యర్ధులకు సీట్లు ఖరారు చేసేస్తున్నారు. ఇదే క్రమంలో పాదయాత్రతో ముందుకెళుతున్న లోకేష్..పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చిన విషయం […]

ఉండవల్లితో వైసీపీ రాజకీయం..కోటంరెడ్డి టార్గెట్ అందుకేనా?

ఏపీ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో లేకపోయినా..ఆయన ఎప్పుడు రాజకీయాలే చేస్తారని చెప్పవచ్చు. అది కూడా జగన్‌కు అనుకూలంగా ముందుకెళుతు ఉంటారు. జగన్‌కు పరోక్షంగా సాయం చేస్తుంటారనే చెప్పాలి. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా, ఆ ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో విమర్శించారో చెప్పాల్సిన పని లేదు. జగన్‌కు లబ్ది జరిగేలా ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేవారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది..ఇప్పుడు […]

విశాఖ ’స్టీల్’ పాలిటిక్స్..ఎవరి ఎత్తు వారిదే.!

రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఏపీలో ప్రతి అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. ఇక ఇక్కడ ఉన్న పార్టీలు చాలనట్లు..పక్కన తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలో ఎదిగే క్రమంలో బి‌ఆర్‌ఎస్ ఏపీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే ఇక్కడ రాజకీయంగా స్పేస్ లేదు..కానీ ఇప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది. అది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముందుకొస్తుంది. విశాఖ […]

 ఉదయగిరి వైసీపీకి కొత్త అభ్యర్ధి..మేకపాటి ఫ్యామిలీ నుంచే.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. కీలకమైన నేతలు వైసీపీకి దూరమయ్యారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరం అవ్వడంతో నెల్లూరులో ఆ పార్టీకి కాస్త మైనస్ కనిపిస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీకి దూరమయ్యారు. దీంతో నెల్లూరులో వైసీపీకి కాస్త ఇబ్బందులు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో వెంటనే ఇంచార్జ్ లని పెట్టారు..కాకపోతే […]

 కృష్ణాలో బాబు టూర్..మూడు చోట్ల తమ్ముళ్ళ రచ్చ..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక దీని ద్వారా జిల్లాలో టి‌డి‌పికి కాస్త ఊపు తీసుకొస్తారని చెప్పవచ్చు. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో బాబు పర్యటన ఉంది. ఈ మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ప్లాన్ చేశారు. అయితే బాబు పర్యటనతో కార్యకర్తల్లో జోస్ నెలకొంది. చాలా […]

 అసెంబ్లీ సీట్లలో ఎంపీలు..జగన్ ఛాన్స్ ఇస్తారా?

వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనని జగన్ ఇప్పటికే చెప్పేసిన విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అటు టి‌డి‌పి, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరందరికి మళ్ళీ సీట్లు ఇవ్వడం అనేది కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం. దీంతో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఎవరికైతే […]