గన్నవరం పంచాయితీ..వంశీపై యార్లగడ్డ పోటీ.!

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం పంచాయితీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రామచంద్రాపురం స్థానంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే తాను గాని తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సుభాష్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్ది చెప్పిన బోస్ తగ్గట్లేదు. ఈ రచ్చ అలా కొనసాగుతుండగానే […]

దేశంలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ సాధ్యమేనా…!?

దేశంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2014లో లోక్ సభలో తొలిసారి కాలుపెట్టిన మోదీ… వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నమో నినాదంతో తొలిసారి, అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ రెండోసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటయ్యింది. ఇక మూడోసారి కూడా గెలుపు తమదే అని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం ఆ స్థాయిలో లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. […]

జోగి తిట్ల దండకం..సీటు కోసమా?

రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలంటే..ప్రజలకు మెరుగైన సేవ చేయడం..నిత్యం ప్రజల కోసం కష్టపడితే..అలాంటి నేతలకు మంచి మంచి పదవులు వరిస్తాయి. కానీ ఏపీలో అధికార వైసీపీలో అలాంటి పరిస్తితి లేదంటున్నారు విశ్లేషకులు. జగన్‌కు భజన చేయడం..చంద్రబాబు, పవన్‌లని బూతులు తిట్టడం..అప్పుడే నేతలకు ఉన్నత పదవులు వస్తాయని చెబుతున్నారు. ఆ దిశగానే పదవులు కూడా ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడటం లాంటి ఉండవని చెబుతున్నారు. అలా ప్రతిపక్ష నేతలని తిట్టే […]

ఇలా అయితే టీడీపీ గెలిచినట్లే…!

ఈసారి గెలవకపోతే…. ఇక భవిష్యత్తు లేదనేది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందే అని ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేసేశారు కూడా. ఇందుకోసం గతానికి భిన్నంగా దాదాపుగా రెండేళ్ల ముందు నుంచే చంద్రబాబు కదన రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఎన్నికలకు ఏడాది ముందే మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక చేసేస్తూ… పార్టీ శ్రేణులను సైతం ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు […]

అమరావతిలో జగన్ పాచిక పారుతుందా….?

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే ఇప్పటి నుంచే గెలుపు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2019లో టీడీపీకి అనుకూలంగా నిలిచిన జిల్లాలు విశాఖ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు మాత్రమే. మిగిలిన అన్ని చోట్ల ఎదురుదెబ్బలే తగిలాయి. చివరికి రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓడిపోయింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. అయితే 3 రాజధానుల […]

శ్రీకాకుళం వైసీపీ ఎంపీ కోసం వేట…!

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపైన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఓడిన నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు… ప్రస్తుతం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామూను ఓడించాలంటే అంతే స్థాయి నేత ఉండాలనేది జగన్ ఆలోచన. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి… ప్రస్తుతం […]

టీడీపీలో అనిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అయితే పార్టీలో మాత్రం సీనియర్ జూనియర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలకు… కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలే అసలైన నేతలని గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అయితే అది కార్యచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా మారిపోయింది. పార్టీ ప్రతిపక్షంలో […]

కుప్పంలో శ్రీకాంత్ దూకుడు..లక్ష రీచ్ అవుతారా?

కుప్పంని సొంతం చేసుకోవాలని వైసీపీ ఎన్ని రకాలుగా రాజకీయం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అధికార బలాన్ని ఉపయోగించుకుని అక్కడ బలపడాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో లోకల్ ఎన్నికల్లో గెలిచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే తిష్ట వేసి..వైసీపీని బలోపేతం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు కూడా దూకుడు పెంచారు. కుప్పంలో వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. వైసీపీ చేస్తున్న […]

రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్న జనసేనాని… ఇలా అయితే అయినట్లే…?

పవన్ కల్యాణ్… సినిమా హీరో కంటే కూడా జనసేన పార్టీ అధినేతగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే.. జగన్ తండోపతండాలుగా వస్తున్నారు. ర్యాలీలు, చప్పట్లు… సీఎం సీఎం అంటూ నినాదాలు… అంతా బాగానే ఉంది కానీ… అసలు జనసేన పార్టీ నేతలెవరు… పవన్ కాకుండా ఆ పార్టీలో ఇతర నేతలెవరైనా ఉన్నారా… ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడించడమే లక్ష్యమని ఇప్పటికే పవన్ పలుమార్లు […]