సీమలో ఆధిక్యం మారింది..కానీ వైసీపీదే హవా!

రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట..అందులో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ ప్రతి జిల్లాలో వైసీపీకి పట్టు ఉంది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి బలం ఎక్కువే. ఇక గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి.

కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేయగా, చిత్తూరులో 14 సీట్లకు 13, అనంతలో 14 సీట్లకు 12 సీట్లు గెలుచుకుంది. ఇలా వైసీపీ సీమలో సత్తా చాటింది. ఈ సారి ఎన్నికల్లో కూడా సీమలో మెజారిటీ సీట్లు దక్కించుకునే దిశగానే వైసీపీ వెళుతుంది. కాకపోతే ఈ సారి టి‌డి‌పి కాస్త పుంజుకుంది. దీంతో కొన్ని సీట్లలో పోటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో వైసీపీ ఆధిక్యం కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల కంటే కాస్త తగ్గే ఛాన్స్ ఉంది..కానీ ఓవరాల్ గా సీమలో వైసీపీకే ఆధిక్యం ఉంటుంది.

కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీకి 7 సీట్లు గ్యారెంటీ..ఇంకా ఒక సీటు గెలిచే ఛాన్స్ ఉంది. ఇటు కర్నూలులో ఖచ్చితంగా 10 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. అనంతలో 7 సీట్లు డౌట్ లేదు. చిత్తూరులో 8 సీట్లలో గెలుపు ఖాయం. అంటే 32 సీట్లు డౌట్ లేకుండా గెలిచేస్తుంది. దానికి అదనంగా 4-5 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. ఎటు చూసుకున్న 35 సీట్ల వరకు సులువుగా గెలుచుకోవచ్చు. మొత్తం మీద సీమలో మళ్ళీ వైసీపీదే ఆధిక్యం.