‘ సలార్ ‘ సినిమాలో డాన్‌గా ఎవ్వ‌రూ ఊహించ‌ని న‌టుడు… థియేట‌ర్ల‌లో కేకే…!

ఆ ఎక్స్పెక్టేషన్స్ని మరో లెవల్ కు తీసుకెళ్లే అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. మిర్చి చిత్రం తర్వాత‌ ప్రభాస్ మాస్ యాక్షన్ రోల్ ఇంతవరకు చేయలేదు. సాహో సినిమాలో యాక్షన్ హీరోగా కనిపించినా ఆ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. అందుకే సలార్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్ చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ సలార్ మూవీ. కేజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు నెలకున్నాయి. ఆ ఎక్స్పెక్టేషను మరో ఎత్తుకు తీసుకెళ్లే అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. పెద్దగా ఫాలోయింగ్ లేని యష్ తోనే కేజిఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చాడు ప్రశాంత్‌ నీల్‌ . అలాంటి డైరెక్ట్ కి ప్రభాస్ లాంటి సాలిడ్ మాస్ కటౌట్ దొరకడంతో గ్లోబల్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

ఆల్రెడీ రిలీజ్ అయిన సలార్ టీజర్ భారీ అంచనాలకు తీసుకెళ్లింది. తాజాగా ఈ చిత్రం కాస్టింగ్ విషయంలో వచ్చిన మరో అప్డేట్ సలార్‌ను గ్లోబల్ మూవీ అన్న రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ హీరో కి రోల్ లో కనిపించబోతున్నాడు అని వార్త ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ మాఫియాను చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే డాన్ రోల్ కోసం హాలీవుడ్ స్టార్‌ను రంగంలోకి దించుతున్నాడు. ఈ అప్‌డేట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.