“భోళా శంకర్”లో శ్రీముఖి ప్లేస్ లో ముందు అనుకున్న బ్యూటి ఈమె.. వద్దు అంటూ చిరంజీవి చేతులెత్తి దండం పెట్టేసాడా..!!

ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ భోళాశంకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సైతం ఘనంగా నిర్వహించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి – కీర్తి సురేష్ ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్లో మరింత స్పెషల్ గా కనిపించింది యాంకర్ శ్రీముఖి.

యాంకర్ గా తన స్థానం టాప్ పొజిషన్లో ఉన్నప్పటికీ శ్రీముఖి వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇలాంటి క్రమంలోనే భోళాశంకర్ సినిమాలో అవకాశం వచ్చి చిరంజీవి పక్కన నటించిన శ్రీముఖి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మెహర్ రమేష్ ఈ సినిమాలో మొదటగా శ్రీముఖి పాత్ర కోసం జబర్దస్త్ కమెడియన్ రోహిణి ఊహించుకున్నారట . ఈ సినిమాలో చిరంజీవికి శ్రీముఖి పాత్రకు మధ్య వచ్చే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయని.. అందుకోసమే ఒక కమెడియన్ ని ఇలా పెడితే బావుంటుంది అని రోహిణి అనుకున్నారట.

అయితే ఇదే విషయం చిరంజీవికి చెప్పగా చిరంజీవి ఆ అమ్మాయి కామెడీ ముందు నేను తేలిపోతాను.. ఆ అమ్మాయి నా పక్కన వద్దు రా బాబోయ్ అంటూ చేతులెత్తి దండం పెట్టేసాడట. చిరంజీవి సరదాగానే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ..మెహర్ రమేష్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు . అందుకే ఆ పాత్ర నుంచి రోహిణి ని రిజెక్ట్ చేసి మరి శ్రీముఖిని పట్టుకొచ్చారు. శ్రీముఖి కూడా కామెడీ బాగా పండిస్తుంది కానీ రోహిణి తో కంపేర్ చేస్తే శ్రీముఖి కూసింత తక్కువనే చెప్పాలి . స్టేటస్ పరంగా శ్రీముఖి హై స్థానంలో ఉన్న కామెడీ కంటెంట్ పరంగా మాత్రం రోహిణి ది బెస్ట్ . చూడాలి ఈ సినిమాలో శ్రీముఖి చిరంజీవి మధ్య వచ్చే సీన్స్ ఎంత బాగా పండుతాయో.