కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిత అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాలు, నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ కౌంటర్ చేసినట్లు కర్ణాటకలో కూడా చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ చేసే వారిలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేరారు. ఆయన ఓ అడుగు ముందుకేసి సజ్జనార్ బాటలో నడవాలని ఆ రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఓ […]
Category: Politics
’ఓటుకు నోటు‘ కేసు.. రేవంత్ కు కోర్టు సమన్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. అక్టోబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, వేంక్రిష్ణ కీర్తన్ లకు సమన్లు పంపింది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలోఉన్నపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేశారని కేసు నమోదైంది. ఈడీ నమోదు చేసిన ఈకేసు […]
హైదరాబాద్ లో కదిలిన ’బండి‘..కమలంలో ఉత్సాహం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసుతన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యకర్తల కోలాహలం మధ్య బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. బండి పాదయాత్రకు బీజేపీ అధిష్టానం ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసింది. బండి సంజయ్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత చాలా మంది సీనియర్లు ఆయనకు సహకరించడం లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో […]
వచ్చే నెల 15 వరకు జగన్ కు టెన్షనే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జగన్ గతంలో జైలులో కూడా ఉన్నాడు. ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీచేసి అనంతరం సీఎం సీటులో కూర్చున్నారు. అయితే ఇపుడు సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశాడు. సీఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిలు […]
దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ […]
జగన్.. డిఫరెంట్ పొలిటీషియన్..?
అసంతృప్తి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ అధినేత రాజకీయం అనేదే ఒక విచిత్రమైన ఆట.. చదరంగంలో వేసే ఎత్తులకంటే పై ఎత్తులు మెరుగ్గా వేయాలి. లేకపోతే అథ:పాతాళానికి నాయకుడు పడిపోతాడు.. ఆ తరువాత ఇక రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుంది. అందుకే రాజకీయ నాయకులు నిర్ణయాలు త్వరగా తీసుకోరు.. తీసుకున్నా అమలు చేయరు.. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన నాయకులు ఎన్టీయార్, నరేంద్రమోదీ.. ఇపుడు వారిని మించి జగన్ పొలిటికల్ గేమ్ ఆడబోతున్నాడు. చూసేవారికి వారి బాటలోనే […]
సత్య నాదెళ్ల గురించి నోరు జారిన రేవంత్ రెడ్డి.. వైరల్ వీడియో!
తెలుగు తేజం సత్య నాదెళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ ముత్యం సత్య నాదెళ్ల. మన దేశ కీర్తిని ప్రపంచ శిఖరం పై ఎగరవేసిన విజేత సత్య నాదెళ్ల. అంతేకాకుండా బిల్ గేట్స్ సైతం తనను మెచ్చుకునేలా చేసుకున్నాడు. అయితే ఇలాంటి వ్యక్తి విషయంలో రేవంత్ రెడ్డి నోరు జారాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం రోజులు మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చదువుకుంటే మన జిల్లాలోనే […]
వైసీపీలో కేవీపీ బావమరిది సత్తా ఎంత ?
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజకీయాల రగడ జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్ – మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్‌బాబు ( సీనియర్ పార్లమెంటేరియన్ కేవీపీ రామచంద్రరావు బావమరిది) ఓ వైపు .. చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజా, ఆయన అనుచరులు మరోవైపుగా ఉంటూ రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఎంపీగా శ్రీధర్ ఉన్నా చింతలపూడి వరకు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీలకంగానే […]
కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]