సత్య నాదెళ్ల గురించి నోరు జారిన రేవంత్ రెడ్డి.. వైరల్ వీడియో!

తెలుగు తేజం సత్య నాదెళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ ముత్యం సత్య నాదెళ్ల. మన దేశ కీర్తిని ప్రపంచ శిఖరం పై ఎగరవేసిన విజేత సత్య నాదెళ్ల. అంతేకాకుండా బిల్ గేట్స్ సైతం తనను మెచ్చుకునేలా చేసుకున్నాడు. అయితే ఇలాంటి వ్యక్తి విషయంలో రేవంత్ రెడ్డి నోరు జారాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం రోజులు మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చదువుకుంటే మన జిల్లాలోనే మన మండలంలోని కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా శాసించవచ్చు అంటూ తెలిపారు. విప్రో ఇన్ఫోసిస్ కి ఇవాళ నాదెళ్ల ఏంది ఆయన పేరు అంటూ అతని వెనుక ఉన్న నాయకులను అడిగే ఆ సత్య నాదెళ్ల ఇవాళ విప్రో ఇన్ఫోసిస్ సీఈవో గా ఉన్నారు అంటూ అతని పేరు చెప్పడానికి కొంచెం తడబడ్డాడు. బాగా చదువుకున్నాడు కాబట్టి అంత మంచి పొజిషన్లో ఉన్నాడు అని తెలిపాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.