వాట్సాప్ లో మరొకసారి కొత్త ఫీచర్..?

వాట్సాప్ లో ప్రతి రోజు కొత్త కొత్త ఫీచర్ల తో మన ముందుకు వస్తూనే ఉంది. ఇప్పటికే వాట్సాప్ ఎన్నో సరికొత్త అప్డేట్లను మన ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో న్యూ కలర్ స్కీం కింద ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఇప్పటికే వాట్సాప్ లో నుంచి గ్రూప్ కాలింగ్, డేటా ట్రాన్స్ఫర్, పేమెంట్ సంబంధించిన సదుపాయాలను కూడా మనకు సరికొత్త ఫీచర్స్ తో మన ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం తీసుకువచ్చిన ఈ న్యూ కలర్ స్కీమ్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.

ఈ కలర్ థీమ్ వల్ల వాట్స్అప్ లో “లైట్ & డార్క్ థీమ్స్ “ని సెట్ చేసుకోవచ్చు. దీంతో పాటే బ్యాక్గ్రౌండ్ తో సెండ్ బటన్ ను కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక ఇది పని చేసే విధానం కూడా చాలా సులభం గా పనిచేస్తుందట. సాధారణంగా వాట్స్అప్ బార్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. కానీ ప్రస్తుతం వచ్చిన కొత్త ఫీచర్స్ తో.. అది గ్రీన్ నుంచి గ్రే కలర్ లోకి మారిపోతుంది.

అలాగే ఓకే టాప్ బార్ తో పాటు గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఒకవేళ మీరు గనక కొత్త ఫీచర్ ను ఉపయోగించినట్లయితే గ్రీన్ కలర్ నుంచి అది గ్రే కలర్ లోకి మారిపోతుంది. టాపు బార్ అలాగే బ్యాగ్రౌండ్ మెసేజ్ బబుల్స్ తో పాటు సెండ్ బటన్ ను కూడా చేంజ్ చేసుకుని అవకాశాన్ని కల్పించబడింది. వాట్సాప్ లో కనుగొనబడిన డబ్ల్యూ ఈ బీటా ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త రంగులు అందుబాటులోకి వచ్చాయి ఇందులో స్టేటస్ అప్డేట్ తో పాటు చాట్ షేర్ చేయటం కూడా మార్చుకోవచ్చు.

దీనితోపాటు మరో కొత్త బీటా వెర్షన్ కూడా తీసుకు వచ్చే అవకాశం ఉందట. అయితే ప్రస్తుతం ఈ వర్షం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది
అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది వాట్స్అప్.