దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన.. గులాబీ శ్రేణుల సంబరాలు.. రాష్ట్రం నుంచి ముందుగానే హస్తినకు చేరుకున్న కార్యకర్తలు, నాయకులు.. వర్షం వస్తున్నా హంగామా.. సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ఏర్పాట్ల పర్యవేక్షణ.. ఇంత పెద్ద.. గొప్ప ప్రారంభ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీ వేదికగా పార్టీకి ఏం దిశానిర్దేశం చేస్తారో? దేశానికి టీఆర్ఎస్ తరఫున ఏం చెబుతారో? అని అందరూ ఎదురు చూశారు. ముఖ్యంగా జాతీయ మీడియా కేసీఆర్ […]
Category: Politics
తెలుగు సీఎంలూ.. స్టాలిన్ నుంచి నేర్చుకోండి..!
అరవయ్యేళ్లు దాటిపోయేవరకు పార్టీకి యువనేతగానే మిగిలిపోయిన స్టాలిన్.. ఈ వయసులో దక్కిన ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఒక మోడల్ అనిపించేలాగా.. నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే.. మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల ఇళ్లకు వెళ్లి పలకరించి.. ప్రభుత్వానికి సహకరించమని అడగడం దగ్గరినుంచీ.. నిన్న మొన్న ఎన్నికలకు ముందు స్కూలు పిల్లలకోసం అప్పటి సీఎం బొమ్మలతో తయారుచేసిన బ్యాగులపై […]
పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?
‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు […]
ఈసారి ఏపీలో గణేష్ ఉత్సవాలు బంద్ .. ఉత్తర్వులు జారీ ..!
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చేలా కనిపించలేదు ఏపీ ప్రభుత్వం.గత సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉండడంతోవ్ గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని సందిగ్ధంలో ఉన్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక వినాయక చవితి పండుగ అంటే అధిక మంది జనాలు గుమిగూడితారు కాబట్టి ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు […]
కేటీఆర్.. పాపులర్ పొలిటీషియన్..
కల్వకుంట్ల తారక రామారావు.. సింపుల్ గా కేటీఆర్ సన్నాఫ్ సీఎం కేసీఆర్.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఆయన కేసీఆర్ కుమారుడిగా కాక సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎంత అంటే.. 30 లక్షల మంది (మూడు మిలియన్లు) తనను ఫాలో అయ్యేంత.. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం గత సంవత్సరం నుంచే 10 లక్షల మంది కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను చూస్తున్నారు. 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో […]
వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!
కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది […]
వైసిపి మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు?
మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన భార్య విజయలక్ష్మి ఫై ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. అయితే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ ఘటన చాలా ఆసక్తిగా మారింది. అంతేకాకుండా గత రెండేళ్లుగా ఒకే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇదే మొదలు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలకు సీబీఐ కేసు నమోదు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. సురేష్ అలాగే ఆయన భార్య విజయలక్ష్మి ఐ ఆర్ ఎస్ అధికారులు. […]
తమిళనాడు సీఎంతో చిరంజీవి భేటీ..కారణం ఏంటంటే?
తమిళనాడు రాష్ట్రంలో పది ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. అంతేకాదు, అతి తక్కువ సమయంలో ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేడు చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా […]
ఈ ఆహ్వానం తో షర్మిల గెలిచినట్టేనా..? ఏకంగా 300 మందికి ఆహ్వానం ..!
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గా ఉన్న.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ..తన కూతురు షర్మిల భవిష్యత్తు కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి , అత్యంత సన్నిహితులైన కొంతమంది నేతలను ఈ సమావేశానికి ఆహ్వానం పలకనున్నారు అనే సమాచారం నిన్నటి వరకు […]