వైసిపి మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు?

మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన భార్య విజయలక్ష్మి ఫై ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. అయితే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ ఘటన చాలా ఆసక్తిగా మారింది. అంతేకాకుండా గత రెండేళ్లుగా ఒకే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇదే మొదలు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలకు సీబీఐ కేసు నమోదు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. సురేష్ అలాగే ఆయన భార్య విజయలక్ష్మి ఐ ఆర్ ఎస్ అధికారులు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం సురేశ్వర ఉద్యోగానికి రాజీనామా చేయగా, తన భార్య మాత్రం ఉద్యోగం లో కంటిన్యూ అవుతోంది.

2016 లో ఐ ఆర్ ఎస్ అధికారులపై సిబిఐ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలోనే విజయలక్ష్మి ఇంటిపై దాడి చేసి సిబిఐ దంపతులిద్దరూ పైన కేసు నమోదు చేసింది. విజయలక్ష్మి ఆస్తి ఎంత ఉంది అని ప్రాథమికంగా విచారించకుండానే సోదాలు జరిపి దంపతులిద్దరూ కేసు పెట్టారని వారు ఆరోపించారు.ఈ విషయంపై దంపతులిద్దరూ హైకోర్టుకు చాలెంజ్ చేశారు. అయితే విజయలక్ష్మి కాకుండా నా పై కేసు నమోదు చేయడం ఏంటని సురేష్ పిటిషన్లో వాదించగా, సి.బి.ఐ ఆ దంపతులు వాదనలను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయింది. దీనిపై కేసు కొట్టేసింది హైకోర్టు. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు సిబిఐ సమాధానం చెప్పలేకపోయింది. అమ్మ దాడుల్లో విజయలక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ట్లు బయటపడిందని సిబిఐ లాయర్ చెప్పారు. మరి అదే విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు సిబిఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. దీనితో విజయలక్ష్మి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది.