న‌య‌న్‌ను ప్రేమ‌గా విఘ్నేష్ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేష‌న్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్ప‌టికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అంద‌రి చేత ఔరా అనిపిస్తున్నారు.

Birthday Special! Nayanthara and Vignesh Shivan's cute love story in PICS |  The Times of India

ఇక త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ఈ జంట ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. న‌మ‌న్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్‌.. ఆమెను ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..? ‘తంగమ్‌’. అవును విఘ్నేష్ న‌య‌న్‌ను ప్రేమ‌గా తంగ‌మ్ అని పిలుస్తాడ‌ట‌. తంగమ్‌ అంటే బంగారం అని అర్థం.

Did Nayanthara just confirm her engagement with Vignesh Shivan? See video |  Entertainment News,The Indian Express

ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే..నయనతార ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో న‌టిస్తున్న ఓ చిత్రానికి సైతం ‘గోల్డ్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్ హీరోగా న‌టిస్తుండ‌గా..అల్ఫోన్స్‌ పుత్రెన్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ మ‌ధ్యే గోల్డ్ షూటింగ్ స్టార్ట్ అయింది.