మాజీ మంత్రికి బాబు హ్యాండ్..జంపింగ్ తప్పదా!

వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు..ఇప్పటికే పలుమార్లు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. యువ ఓటర్లని ఆకర్షించడం, నారా లోకేష్ నాయకత్వాన్ని బలపర్చేలా యువ నాయకత్వాన్ని పెంచే దిశగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాల్లో సీనియర్లని పక్కన పెట్టి యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటులో సైతం సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ […]

సైకిల్‌ని గుర్తుచేసుకుంటున్న కారులోని మాజీ తమ్ముళ్ళు.!

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో సగానికి సగం పైనే టీడీపీ నుంచి వచ్చిన వారే..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆఖరికి కేసీఆర్ సైతం టీడీపీ నుంచి బయటకొచ్చిన నాయకుడే. ఇక రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా టీడీపీని కేసీఆర్ లాగేసుకున్నారు. టీడీపీ నేతలనే కాదు..కార్యకర్తలని కూడా లాక్కున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టమైంది. అయితే ఇటీవల చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి..పార్టీ వీడి వెళ్ళిన నాయకులని మళ్ళీ పార్టీలోకి రావాలని కోరిన విషయం […]

కర్నూలు సిటీ వైసీపీలో రచ్చ..టీడీపీలో భరత్‌ ఫిక్స్?

కర్నూలు సిటీ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డా. గతంలో టీడీపీ ఇక్కడ రెండుసార్లు, సి‌పి‌ఎం రెండుసార్లు గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. అయితే వైసీపీ భారీ విజయాలు ఏమి సాధించడం లేదు. 2014 ఎన్నికల్లో కేవలం 3479 ఓట్ల తేడాతో టీడీపీపై వైసీపీ గెలిచింది. జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికల్లో సైతం 5353 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అంటే రెండు […]

ఆనం సీటుకు ఎసరు..అంతా జగనే అంటున్న బొత్స..!

అధికార వైసీపీలో ఊహించని విధంగా కొందరు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి వైసీపీపై తిరుగుబాటు చేసి ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ నేతగా మారిపోయారు. ఆయన మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం తమ ప్రభుత్వంపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ మధ్య మద్దిశెట్టి వేణుగోపాల్..అటు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు తమ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం […]

కావలిపై పట్టు..ప్రతాప్ టార్గెట్‌గా టీడీపీ స్కెచ్!

కందుకూరులో విషాద ఘటన నుంచి తేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబు..కావలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. ఇక చనిపోయిన కుటుంబాలకు టీడీపీ నుంచి 15 లక్షలు, టీడీపీ నేతల నుంచి 10 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇచ్చారు..ఇంకా కొంతమంది నేతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న పిల్లలని చదివించే బాధ్యత తాను […]

టీడీపీ ‘ఘర్‌వాపస్’..ఆ నాయకులతో టచ్‌లోకి!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఘర్‌వాపస్ కార్యక్రమం చేపట్టింది. 2018 ఎన్నికల తర్వాత టీడీపీలో మిగిలిన వారు కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాదాపు ఆ పార్టీలో తక్కువ మంది నేతలు మాత్రమే మిగిలారు. అయితే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్‌ని అధ్యక్షుడుగా పెట్టారు. ఇటీవల ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ చేశారు. ఆ సభ వేదికగానే..ఇతర పార్టీల్లోకి వెళ్ళిన మాజీ తమ్ముళ్లని మళ్ళీ తిరిగి […]

బాబుకు కుప్పం టెన్షన్..మరోసారి టూర్.!

అసలు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వెళ్లకుండా..టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయించి..కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుని..పదే పదే కుప్పం వెళ్ళేలా అధికార వైసీపీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కేవలం కుప్పంపై ఫోకస్ చేసి..అక్కడ టీడీపీని దెబ్బతీసేలా స్కెచ్ లు వేస్తూ వచ్చారు. చాలావరకు టీడీపీ నేతలని వైసీపీలోకి […]

లోకేష్ ‘యువగళం’: వైసీపీ అడ్డుకుంటుందా?

మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే..మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు తోడుగా లోకేష్ సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు..100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర కొనసాగనుంది. అయితే లోకేష్ పాదయాత్రకు తాజాగా యువగళం అని పేరు […]

ఆనం వారి అసంతృప్తి..సిగ్నల్స్ ఇస్తున్నారా?

మొదట నుంచి అధికార వైసీపీలో అసంతృప్తి గళం వినిపిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే..అది సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అని చెప్పవచ్చు. వాస్తవానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడైతే వైసీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారో..అప్పటినుంచే ఆనం కూడా సొంత పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. కాకపోతే రఘురామ మరీ దూకుడుగా విమర్శలు చేశారు. ఆనం విమర్శలు చేసినా మధ్యలో సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన పార్టీకి దూరం అవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో […]