ఆ వైసీపీ ఎమ్మెల్యేపై సొంత అన్న తిరుగుబాటు..టీడీపీలోకి జంప్!

అధికార వైసీపీలో తిరుగుబాటు నేతల సంఖ్య పెరుగుతుంది. ఓ వైపు కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వ తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. మరికొండఋ నేతలు ఏమో సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా వెనుకాడటం లేదు. అవసరమైతే ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు. తాజాగా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ సొంత అన్న సుదర్శన్..టీడీపీలో చేరిపోయారు.  ఎమ్మెల్యే సుధాకర్‌ తనకు స్వయానా తమ్ముడని.. […]

టీడీపీలోకి సుచరిత..రెండు సీట్లు ఆఫర్?

ఇటీవల అధికార వైసీపీలో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆ విమర్శల దాడిని మరింత పెంచారు. దీంతో ఆయనని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఆనం..టీడీపీలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. అటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం అసంతృప్తిగానే ఉన్నారు. ఈయనకు నెక్స్ట్ వైసీపీలో […]

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఫిక్స్ అంటా!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా బలపడుతుంది..అదే సమయంలో టీడీపీతో పొత్తుకు జనసేన రెడీ అవుతుంది. ఇదే జరిగితే వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. అప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతాయి..దాని బట్టే కొందరు నేతలు జంపింగులకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అధికారంలోకి వచ్చే ఊపు ఉన్న పార్టీలోకి నేతలు జంప్ చేసేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త చర్చ నడుస్తోంది..కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ప్రచారం […]

దేవినేనికి కొత్త ఆప్షన్..మైలవరం వదులుకోవలా?

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి..గత ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడి జిల్లాలో బలపడుతున్న టీడీపీలో సమీకరణాలు మారుతున్నాయి. ఇక్కడ కొన్ని కీలక మార్పులు జరిగేలా ఉన్నాయి. కొన్ని సీట్లలో అభ్యర్ధులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో సీనియర్ గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాని..చంద్రబాబు కీలక స్థానంలో నిలబెట్టడానికి చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సారి మైలవరం వదిలేసుకుని దేవినేని..గుడివాడ లేదా గన్నవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని […]

విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్‌కే..గద్దెతో ఈజీ కాదా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగానే జగన్ రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే చాలు మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండవచ్చని అంటున్నారు. అంటే జగన్ ప్లాన్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ చేతుల్లో ఉన్న విజయవాడ ఈస్ట్ స్థానంలో వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్‌ని ప్రకటించారు. అవినాష్..వచ్చే […]

మాణిక్కం ప్లేస్‌లో మాణిక్..రేవంత్ సైడ్ అవుతారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేసిన విషయం తెలిసిందే. ఇద్దరు నేతలు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని, పదవుల పంపకాల్లో సీనియర్లకు అన్యాయం జరిగిందని గళం విప్పారు. దీంతో ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వచ్చి..నేతల సమస్యలు తెలుసుకున్నారు. అయితే మెజారిటీ సీనియర్ నేతలు..రేవంత్, మాణిక్కంని తప్పించాలని డిమాండ్ చేశారు. […]

బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారా..కుప్పంలో తమ్ముళ్ళు తగ్గలేదు.!

మొత్తానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో..కుప్పంలో టీడీపీ శ్రేణులని నిలువరించలేకపోయింది..వరుసగా కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడంతో..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలు చేయకూడదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే సభలు పెట్టుకోవాలని సూచించారు. అయితే నెల క్రితమే చంద్రబాబు కుప్పం టూర్ షెడ్యూల్ అయింది. దీంతో తాజాగా బాబు కుప్పంకు వచ్చారు..కానీ అడుగడుగున కుప్పంలో టీడీపీ శ్రేణులని పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రచ్చబండ స్టేజిని తీసేశారు. […]

గుంటూరు వెస్ట్‌లో కొత్త ట్విస్ట్..టీడీపీ సీటు ఆమెకేనా?

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన స్థానాల్లో గుంటూరు వెస్ట్ కూడా ఒకటి. గుంటూరు నగరంలో ఉన్న ఈ సీటులో గత రెండు ఎన్నికల నుంచి టీడీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్నా సరే టీడీపీ నుంచి మద్దాలి గిరి గెలిచారు. కానీ తర్వాత మద్దాలి వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇంచార్జ్ గా కోవెలమూడి రవీంద్ర పనిచేస్తున్నారు. అయితే ఈయనకు నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమే […]

ఎమ్మెల్యే అవుతా..సీటు ఎక్కడ బుద్దా?

విజయవాడ తెలుగుదేశంలో జరిగే అంతర్గత రాజకీయాలు ఎప్పుడు వివాదాస్పదం అవుతాయనే చెప్పాలి. అక్కడ సొంత పార్టీ నేతలతోనే పడదు. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడని విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వారి మధ్య బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సీటు విషయంలో వారి మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ సీటుకు ఇంచార్జ్ గా కేశినేని నాని ఉన్నారు..అయినా […]