తమిళనాట రాజకీయాలు ఊహించని మలుపులతో థిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి! అధికారం కోసం జరుగుతున్న ఆధిపత్య పోరులో.. ఎన్నో ట్విస్ట్‌లు నమోదవుతున్నాయి! ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో జయ నెచ్చెలి శశికళపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో శశికళపై అసెంబ్లీ మాజీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ ఆసుపత్రిలో చేరిన రోజు రాత్రి ఏమయిందో బట్టబయలు చేశారు! సెప్టెంబరు 22న పోయెస్ గార్డెన్‌లో శశికళకు, జయకు మధ్య తోపులాట జరిగిందని, అందులోనే జయను శశికళ తోసేయడంతోనే ఆమె […]
Category: Latest News
తమిళనాడు సీఎం పీఠంతో బీజేపీ గేమ్!
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపుతిరిగాయి! ప్రస్తుతం తమిళ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా శాసించ బడుతున్నాయి. ఏరికోరి సీఎం పీఠం ఎక్కాలని కలలు కన్న శశికళ కేంద్రంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్లికట్టు ఆడేస్తోంది! శశికళను సీఎం కాదుకదా.. ఆ సీటు దగ్గరకు కూడా వెళ్లకుండా ప్లాన్ మీద ప్లాన్ ప్లే చేసేస్తూ.. ఇందిరాగాంధీ హయాంలో వ్యవహరించిన కాంగ్రెస్‌ను తలదన్నేలా బీజేపీ వ్యవహరిస్తోంది. విషయంలోకి వెళ్లిపోతే.. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత […]
ఏపీ కాంగ్రెస్ లో ఆమె ఒక్కరే మిగిలింది..!
కొన్ని దశాబ్దాల నాటి ఆకాంక్షను ఒక్క కలం పోటుతో సాకారం చేసిన ఘనతను సొంతం చేసుకున్న పార్టీ కాంగ్రెస్! ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకొనేమాట! కానీ, అదే కలం పోటు.. అదే దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీని నామ రూపాల్లేకుండా చేసేసింది!! ఇది ఏపీ కాంగ్రెస్ నేతలు కళ్లు తుడుచు కుంటూ చెబుతున్న మాట!! తెలంగాణ ఆకాంక్ష విషయంలో కాకలు తీరిన కాంగ్రెస్ నేతలు సైతం విభజన దిశగా అడుగులు వేయలేకపోయారు. ఎప్పటికప్పుడు సమస్యలను […]
ఎమ్మెల్యేగానే లోకేష్ పోటీ..! నియోజకవర్గం ఇదే..?
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని టీటీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పిన నాటి నుంచి.. టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను ఎమ్మెల్సీ కోటా నుంచి ఎన్నుకుంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌కు పోటీగా లోకేష్‌ను భావిస్తున్న సమయంలో.. ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి వెళితే ప్రతికూల సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనేది ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇప్పుడు లోకేష్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం! […]
ఏపీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ?
కీలకమైన మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఉప ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది! అందులోనూ ఈ ఎన్నికల్లో సేఫ్ గేమ్‌కు తెరతీస్తోంది. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని.. వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు.. వీరి విజయంతో తమ పార్టీకి తిరుగులేదని నిరూపించవచ్చనే వ్యూహంతో బరిలోకి దిగాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వైకాపా నుంచి పార్టీలోకి చేరిన జంప్ జిలానీలతో […]
తుమ్మలకు జగదీష్ రెడ్డికి ఎక్కడ చెడింది
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ముఖ్యంగా తెదేపా నుంచి టీఆర్ఎస్‌లో చేర కేసీఆర్ మన్ననలు పొందుతున్న తుమ్మల నాగేశ్వరరావుకు, కేసీఆర్ వెన్నంటే నడుస్తూ ఉన్న జగదీశ్వర్ రెడ్డికీ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమయింది. తనకు ప్రాధాన్యం తగ్గిస్తూ.. తుమ్మలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు, తన జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడంపై జగదీశ్వర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతుననారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ […]
చిన్నమ్మ జాతకాన్నిమార్చలేని జ్యోతిష్కులు
తమిళనాట రాజకీయ సింహాసనంపై కూర్చోవాలని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తహతహలాడుతున్నారు! అప్పుడో ఎప్పుడో సీఎం అవుతారని అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు.. ప్రజలు కూడా భావించారు. కానీ అనూహ్యంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆగమేఘాల మీద చేసి ఆశ్చర్యపరిచారు. సీఎం పీఠం ఎక్కేందుకు శశికళ ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ తొలుస్తోంది! అయితే దీనికి మన్నార్ గుడి జ్యోతిషుల ప్రభావం అధికంగా ఉందని సమాచారం! రాజకీయ నాయకులకు […]
నారాయణ ప్లేస్ లో ఆ రెడ్డిగారు ఎంట్రీ..!
ఏపీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత కీలకమైన పొజిషన్ ఉన్నారు నారాయణ విద్యాసంస్థల అధినేత పి నారాయణ. మునిసిపల్ శాఖా మంత్రిగానే కాకుండా రాజధాని అమరావతి నిర్మాణం, సీఆర్ డీఏ చైర్మన్‌గా ఆయన కీలక చక్రం తిప్పుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. తన సొంత జిల్లా నెల్లూరుపై నారాయణ మంచి పట్టు సాధించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న మ్యాటర్. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు.. పదవులన్నీ శాశ్వతంగా ఉండవు కదా! ఇప్పుడు నారాయణ పరిస్థితి […]
బాబు కేబినెట్ లో వీరు సేఫ్
ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడికలు, తీసివేతల్లో తలమునకలైపోయారు. ఈ క్రమంలో బాబు తన టీంలోని కొందరు మంత్రులను ఎలాంటి సంకోచం లేకుండా తీసి పక్కన పెడతారని టాక్ నడుస్తుండగా.. మరికొందరి విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఎలాంటి మార్పూ ఉండబోదని అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రులపై ఆరోపణలు […]
