గతంలో ఓ వెలుగు వెలిగినా ప్రస్తుతం చిన్నపత్రికల స్థాయికి పడిపోయిన ఓ పత్రికా సంస్థ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ విషయమేమిటంటే సదరు పత్రికా యజమాని కొంత కాలం కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతంలో ఈయనగారికి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తనయుడికి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందన్నఆశతో ఆపార్టీలో చేరిన సదరు నేత ఆ మేరకు కొడుక్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడ […]
Category: Latest News
అబ్బాయ్ జగన్ కోసం రంగంలోకి బాబాయ్
జగన్ పార్టీ వైకాపా నుంచి ఆయన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారా అంటే ఇప్పుడు ఔననే ఆన్సరే వస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలతోపాటు కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులకు త్వరలోనే ఎన్నికల కోడ్ కూయనుంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైకాపా అధినేత జగన్ తన సొంత బాబాయి వివేకానంద రెడ్డిని పంపాలని భావిస్తున్నారు. […]
తెలంగాణ మంత్రులకు ఏమైంది..?
ప్రస్తుతం తెలంగాణలో కుటుంబ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయన్నవిపక్షాల మాటలు కాసేపు పక్కనబెడితే.. అసలు కేసీఆర్ కు దీటుగా నిలిచి నెగ్గుకు రాగల నేత మరొకరు టీఆర్ఎస్లో మాత్రమే కాదు.. తెలంగాణకు సంబంధించినంతవరకు మరే పార్టీలోను కనిపించడం లేదన్నది నిష్టుర నిజం. దీంతో ఆ పార్టీ హవాకు అక్కడ ఎదురే లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా మిగిలిన మంత్రులంతా డమ్మీలు అయిపోయారంటూ విపక్షాలు చేస్తున్నవిమర్శల అంశాన్ని జనం కూడా పెద్దగా […]
పవన్ బాటలో జగన్
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే ప్రస్తుతం ఏపీలో బహిరంగ సభల రాజకీయాల వేడి మొదలైనట్టు కనిపిస్తోంది. నిజానికి దీనికి తెరదీసింది మాత్రం.. ఇంకా రాజకీయాల్లో పార్ట్ టైం పాత్రను మాత్రమే పోషిస్తున్న పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. రాజకీయాలపై తన దిశ దశ ఎలా ఉండబోతున్నాయో ప్రజలకు సవివరంగా చెప్పేందుకంటూ ఆయన తిరుపతిలో తొలిసారిగా బహిరంగ సభను నిర్వహించారు. ఆ తరువాత కేంద్రం… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాకినాడలో మరో సభ నిర్వహించారు. […]
తన తండ్రిని చంపినవారి కోసం నయీమ్‌తో మాజీ మంత్రి దోస్తీ!
దాదాపు రెండు నెలల కిందట తెలంగాణ పోలీసుల చేతిలో దారుణంగా హతమైన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్‌తో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చట్టాపట్టాలేసుకుని, భుజం భుజం రాసుకుని తిరిగారా? తన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీపాదరావును దారుణంగా హత్య చేసిన వారిపై కక్ష తీర్చుకునేందుకు శ్రీధర్.. నయీమ్‌తో చేతులు కలిపారా? గ్యాంగ్ స్టర్ కనుసన్నల్లో మెలిగి.. ఇటు తన కక్షను తీర్చుకుంటూ.. అటు నయీమ్‌కి సహకరించారా? అంటే ఔననే […]
సీఎంను బ్రోకర్‌తో పోల్చిన హీరోయిన్
మహారాష్ట్ర సీఎం ఫడనవీస్ ఓ బ్రోకర్‌గా మారారని బాలీవుడ్ ఒకప్పటి నటి షబానా అజ్మీ ఓ రేంజ్లో ఫైరయ్యారు. అంతేకాదు, దేశ భక్తికి సీఎం వెలకట్టి అమ్ముకున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు సంధించారు. ఇలాంటి సీఎం ఉండడం దౌర్భాగ్యమని కూడా నిప్పులు చెరిగారు. అంతేకాదు, తాను రాజ్యాంగ పరిధిలోనే సీఎం ను విమర్శించానని కూడా అజ్మీ సమర్ధించుకున్నారు. ఇంతకీ.. అజ్మీకి అంత కోపం తెప్పించిన ఘటన ఏమై ఉంటుంది? అనేగా సందేహం. చదవండి.. తెలుస్తుంది.. కరణ్ […]
ఆ ఇద్దరికి కండీషన్లతో మంత్రి పదవులు
చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. పార్టీలోని సీనియర్లకు ఈ సారి మంత్రి పదవులు ఖాయమని కొన్నాళ్లు ప్రచారం జరగ్గా.. కాదు, వైకాపా నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలనే మంత్రి వర్గం లోకి తీసుకుంటారని కొన్నాళ్లు ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది! వైకాపా నుంచి జంప్ చేసి సైకిల్ ఎక్కిన వారిని కేబినెట్లోకి తీసుకుంటే ఎదురయ్యే రాజ్యాంగ సమస్యల గురించి గవర్నర్ […]
సోము వీర్రాజు… కామెడీ రాజకీయం..!
గత ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఈ కూటమి ప్రభావం పరిమితంగానే పనిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలైన దగ్గర్నుంచే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు పొడచూపడమే కాకుండా అసలు ఈ రెండూ మిత్ర పక్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి. ఇక ఏపీ విషయానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కూడా తమ బలం […]
తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం చూస్తే షాకే
తెలంగాణ ప్రజల నాడిని, అనుక్షణం పసికడుతూ… పాలనలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ.. అవసరమైనపుడు మళ్లీ ఉద్యమ భాషను ఉపయోగించి ప్రత్యర్థుల నోళ్లు, చేతులు కట్టేస్తూ టీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా అప్రతిహతంగా, ప్రత్యర్థులకు అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చాక రోజులు గడుస్తున్నకొద్దీ.. అధికార పార్టీపై ప్రజల్లో ఏదో ఒక స్థాయిలో వ్యతిరేకత రావడం.. అది పెరుగుతూ పోవడం సర్వ సాధారణవిషయం. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఈ సంప్రదాయ లెక్కలేవీ… లెక్కలోకి రావని […]