తనది కాకపోతే.. కాశీదాకా ఎదురు డేకచ్చని సామెత! ఇప్పుడు కర్ణాటక మంత్రి వర్యుడు ఒకాయన వ్యవహారం కూడా అచ్చు ఇలానే ఉందట. ఆయన గారి పదిరోజుల భోజనం ఖర్చు 4 లక్షల రూపాయలట! సాధారణంగా ఎంత పెద్ద హోటల్‌లో భోజనం చేసినా పూటకి 4 వేలకు మించి బిల్లు కాదు. ఇక, సాధారణ బోజనం అయితే, రూ.200 బిల్లు దాటనే దాటుదు. అయినప్పటికీ.. కర్ణాటకలోని ఓ మంత్రి మాత్రం వస్తోంది కదా ఊరికినే అని పది రోజుల్లో […]
Category: Latest News
విశాఖ కుంభకోణాన్ని పక్కదోవ పట్టించేశారా?
విశాఖ భూ కబ్జా వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి మధ్య వివాదంగా మారింది. ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. భూకుంభకోణం గురించి ప్రజలు ఆలోచించకుండా.. దానిని నీరుగారే ప్రయత్నం జరుగుతోందనే చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న సమయంలో.. అయ్యన్నపై మంత్రి గంటా లేఖ […]
చంద్రబాబు తీరుతో నేతల్లో ఆందోళన
పార్టీ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా.. ఆచరణలో మాత్రం వాటిని పట్టించుకోవడం లేదా? సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో ఏర్పడుతున్న జాప్యం వల్ల పార్టీకి కొంత నష్టం కలుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత.. పార్టీ శ్రేణుల్లో ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. పార్టీలో అసంతృప్తుల సంఖ్య […]
సీబీఐ దర్యాప్తుకి `నో` వెనుక రీజన్ ఇదేనా?
ఏదైనా కుంభకోణం బయటపడినా, ఆరోపణలు వచ్చినా వెంటనే `సీబీఐకి కేసు అప్పగించాలని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా.. ఎంత గందరగోళం సృష్టించినా.. వాటన్నింటినీ ఏమాత్రం ఖాతరు చేయరు తెలంగాణ సీఎం కేసీఆర్. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో, గ్యాంగ్ స్టార్ నయీం కేసులోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఇప్పుడు మియాపూర్ భూకుంభకోణం లోనూ కేసీఆర్ దీనినే ఫాలో అవుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించకుండా ఆ వివరాలను తన దగ్గరే ఉంచుకోవడం వెనుక వ్యూహం వేరే ఉందని పార్టీలో […]
టీఆరెస్ మంత్రులకు పాతవి బోర్ కొట్టాయా లేక భయం పట్టుకుందా!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. కేవలం అభివృద్ధి, అభ్యర్థుల పనితీరు ఆధారంగానే గెలుపోటములు ఉంటాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు కేసీఆర్ సర్వేల్లో మంచి మార్కులే ఉన్నా ఎక్కడో చిన్న అనుమానం ఉండడంతో వారు వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో బిజీ […]
టీడీపీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుందా..!
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఆ పార్టీలో లుకలుకలు పార్టీ ఆవిర్భవించిన ఈ మూడున్నర దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా ఉన్నాయి. పార్టీలో ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చిన జంపింగ్ జపాంగ్‌ల దెబ్బతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే 2019 ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం కలగక మానదు. అన్ని జిల్లాల్లోను మంత్రులు, నాయకుల మధ్య […]
నంద్యాలలో టీడీపీకి కష్టాలు..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ఈ రోజు వైసీపీలో చేరడంతో ఇక్కడ బలాబలాలు మారుతున్నాయి. నిన్నటి వరకు ఇక్కడ టీడీపీ మూడు గ్రూపులుగా ఉంది. ఈ మూడు గ్రూపుల్లో ఒకరికి మరొకరితో అస్సలు పొసగలేదు. భూమా వర్గం, శిల్పా వర్గం, మాజీ మంత్రి ఫరూఖ్ ఇలా వీరు వేర్వేరు గ్రూపులుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ముగ్గురు […]
జ్యోతి.. ఈనాడును మించుతోందా?
ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా లార్జెస్ట్ సెర్క్యులేషన్‌తో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న ఈనాడుకు ఇప్పడు జ్యోతి రూపంలో చాపకింద నీరులా పోటీదారు పేట్రేగిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్ నేతృత్వంలోని సాక్షి ఈనాడుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, రానురాను రామోజీ దెబ్బకి మెత్తబడి ఎలాంటి పోటీ గీటీ లేకుండానే తన మానాన తను పని కానిస్తోంది. కానీ, ఆర్కే నేతృత్వంలోని ఆంధ్రజ్యోతి […]
భూ కుంభకోణంలో డీఎస్.. కేసీఆర్‌కి మరో తలనొప్పి!
తెలంగాణలో అధికార పార్టీ ఇప్పుడు భూ కుంభకోణాలతో సతమతమవుతోంది. ఆయా కుంభకోణాల్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల పేర్లు ఉండడం మరింతగా ఆందోళనకు గురి చేస్తోంది. మియాపూర్ భూ కుంభకోణం కేసలో టీఆర్ ఎ స్ సెక్రటరీ జనరల్ కేకే పేరు బాహాటంగానే వినిపించింది. దీంతో ఏకంగా కేసును తానే బదలాయించుకుని పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్. ఇక, ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సలహాదారు, కేసీఆర్‌కి అత్యంత ఆప్తుడు సీనియర్ పొలిటీషియన్ అయిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)పైనే భూ ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.నాలుగు […]