అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సింగ‌ర్ సునీత‌!

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోను ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే సునీత‌.. ఇటీవ‌లె ప్ర‌ముఖ‌ పారిశ్రామిక వేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి సునీత‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా క‌నిపిస్తున్న సునీత‌.. గ‌త రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌చ్చి అభిమానుల‌తో ముచ్చ‌టించారు. నెటిజన్ల […]

పెళ్లిపై ఛార్మీ ఘాటు వ్యాఖ్య‌లు..నిరాశ‌లో ఫ్యాన్స్‌!

గ‌త రెండు రోజులుగా ఛార్మీ కౌర్ పెళ్లి వార్త‌లు నెట్టింట్లో జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఛార్మీ పెళ్లి ఫిక్స్ అయింద‌ని.. బంధువుల అబ్బాయినే ఆమె వివాహం చేసుకోబోతోంద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి వార్త‌ల‌పై ఛార్మీ ఘాటుగా స్పందించింది. తాను ప్రస్తుతం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని.. కెరీర్ పరంగా కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నానని.. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం లాంటి తప్పుడు నిర్ణయం తీసుకోన‌ని కుండ […]

న్యాయ‌వాది దంప‌తుల హ‌త్య‌లో ఈట‌ల ప్ర‌మేయం..?

హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు […]

భ‌లే విచిత్రం.. ప్ర‌తిప‌క్ష‌నేత‌కు మంత్రి బ‌హిరంగ‌లేఖ‌

ఎక్క‌డైనా స‌రే అధికార పార్టీకి, మంత్రుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు లేఖ‌లు రాయ‌డం, విజ్ఞ‌ప్తులు చేయ‌డం చేస్తుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం మంత్రినే ప్ర‌తిప‌క్ష నేత‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ లేఖ రాసింది ఎవ‌రంటే తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, మ‌రి ఎవ‌రికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. […]

ఆ తేదీవ‌ర‌కూ క‌రోనా తీవ్రత.. విశాఖ శార‌దాపీఠం

కొవిడ్ సెకండ్ వేవ్ సుడిగాలిలా విజృంభిస్తున్న‌ది. మ‌హ‌మ్మారి పంజాకు వేలాది మంది ప్రాణాల‌ను కోల్పోతుండ‌గా, ల‌క్ష‌లాదిమంది గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా విశాఖ శార‌దా పీఠాధిప‌తులు శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి మ‌హాస్వామి క‌రోనా ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటుంద‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్‌ 13వ తేదీన) పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న […]

రంగురంగుల గౌనులో మెరిసిపోతున్న ర‌ష్మి..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈటీవీలో ప్రసారం అయ్యే ప్ర‌ముఖ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న అంద‌చందాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఈ బ్యూటీ. ఈ షోకు ముందు ప‌లు సినిమా చేసినా ర‌ష్మికి గుర్తింపు ద‌క్క‌లేదు. కానీ, బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా మాత్రం సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా, ఢీ షో లో టీమ్ […]

పవన్ అభిమానులకు శుభవార్త ..!

జనసేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా త‌న ఫాం హౌజ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న కోలుకున్న విష‌యాన్ని జ‌నసేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు రోజుల కింద‌ట పవన్ కళ్యాణ్ కు ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష‌ల‌లో ఆయనకు నెగెటివ్ వ‌చ్చింది. ఆరోగ్య‌ప‌రంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపిన‌ట్టు […]

మెగా ఆఫ‌ర్ ప‌ట్టిన ఎన్టీఆర్ హీరోయిన్‌?

మమతా మోహన్ దాస్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన యమ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన మ‌మ‌తా.. న‌టిగానే కాకుండా సింగ‌ర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న స‌మ‌యంలో ఈ బ్యూటీ అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సడన్‌గా కనుమరుగయ్యారు. మ‌ళ్లీ చాలా ఏళ్ల త‌ర్వాత మ‌మ‌తా లాల్ భాగ్ అనే త్రిభాషా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో […]

బ్రేకింగ్ : కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!

ఏపీలో ఘోరం జరిగింది. ముగ్గురాయి గనిలో పేలుడు వద్ద ప్రమాదం చోటుచేసుకోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కడపజిల్లాలోని కలసపాడు మండలంలో చోటుచేసుకుంది. ముగ్గురాయి గనిలో కార్మికులు ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు వల్ల కొందరి పరిస్థితి విషమంగా తయారైంది. జిలిటెన్‌ స్టిక్స్‌ వాహనంలో తీసుకువస్తుండగా, ప్రమాదవశాత్తు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురాయి గనిలో పనుల కోసం […]