అల్లు శిరీష్ మెడ‌కు గాయం..ఏం జ‌రిగిందంటే?

అల్లు అర‌వింద్ త‌న‌యుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అల్లు శిరీష్‌.. ప్ర‌స్తుతం ప్రేమ కాదంట అనే ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాకేశ్‌ శశి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం శిరీష్ బాడీ పెంచే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా జిమ్‌లో శిరీష్ తెగ కష్టపడిపోతోన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష్ మెడ‌కు తీవ్ర గాయం అయింది. వర్కవుట్‌ సమయంలో శిరీష్ […]

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న‌ పాయ‌ల్ ప్రియుడు..త్వ‌ర‌లోనే..?

పాయ‌ల్ రాజ్‌ పూత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపి భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ చిత్రం త్వ‌రాత‌ వ‌రుస సినిమాలు చేసినా పాయ‌ల్ హిట్ అందుకోలేక‌పోయింది. వ‌రుప ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈ బ్యూటీ మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ‌..ఆది సాయికుమార్‌తో కిరాత‌క సినిమాలో న‌టిస్తోంది. […]

ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంట‌ల‌క్క‌..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

కార్తీక‌దీపం సీరియ‌ల్ ద్వారా వంట‌ల‌క్క‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది ప్రేమీ విశ్వనాథ్‌. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. త్వ‌ర‌లోనే వెండితెర‌పై ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ […]

పూజా హెగ్డే జోరు..ధ‌నుష్‌కు కూడా ఒకే చెప్పేసింద‌ట‌?!

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ధునుష్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌తో త‌న తొలి తెలుగు సినిమా చేసేందుకు ఒకే చెప్పాడీయ‌న‌. ఈ మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభించకముందే ధ‌నుష్ యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు ఊపందుకున్నాయి. ఈ చిత్రం విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో సాగ‌బోతోంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మ‌రో వార్త వైర‌ల్‌గా […]

మ‌హేష్‌తో సినిమా..సీక్రెట్ రివిల్ చేసిన మణిరత్నం!

విభిన్న‌మైన చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుని సినీ ప‌రిశ్ర‌మ‌లో డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అంద‌రూ ఆయ‌న చిత్రాల‌కు ఫిదా అవుతుంటారు. ఇదిలా ఉంటీ.. ఆ మ‌ధ్య మ‌ణిర‌త్నం మ‌హేష్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, మ‌హేష్‌ను మ‌ణిర‌త్నం క‌లిసి క‌థ చెప్పార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మ‌ణిర‌త్నం.. ఈ […]

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జ‌గ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అటువంటి ఆయ‌న‌ తాజాగా బ్యాట్ ప‌ట్టి ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సందర్శించారు.స్టేడియంలో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సరదాగా స్టేడియంలో క్రికెట్‌ […]

`నార‌ప్ప‌` నుంచి న్యూ అప్డేట్‌..వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించ‌గా..కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మిళంలో హిట్ అయిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్‌. ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ చేశారు నార‌ప్ప మెక‌ర్స్‌. […]

`స్టాండప్‌ రాహుల్‌` టీజర్ వ‌చ్చేసింది..మీరు చూశారా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం స్టాండప్‌ రాహుల్‌. కూర్చుంది చాలు అన్న‌ది ట్యాగ్ లైన్‌. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నంద కుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను ద‌గ్గుబాటి రానా విడుద‌ల చేశారు. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ […]

వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!

మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో […]