ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు నరేంద్రమోడీ హాజరుకానున్నారు. తొలిసారి ప్రధాని తెలంగాణకు వస్తున్న సందర్భంలో, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే, పార్టీల పరంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇలాంటి విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఆ హద్దులేవీ లేకుండా నరేంద్రమోడీ టూర్‌ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, మంత్రులందర్నీ మోహరిస్తున్నారు. […]
Category: Latest News
సునీల్ డబుల్ ధమాకా
కామెడీ హీరో సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమాతో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడట. తెరపై ఇద్దరు సునీల్‌లు ఒకేసారి కనిపిస్తే ఇంకేమన్నా ఉందా? అవునండీ ఇది నిజమట. ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమాలో సునీల్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారమ్. అయితే సినిమా విడుదలకు దగ్గరయ్యేదాకా ఈ విషయాన్ని చాలా గోప్యంగా దాచిపెట్టారు. ఇప్పటికి కూడా దీనిపై అధికారిక సమాచారం లేకపోవడం గమనించదగ్గది. వీరు పొట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈడు గోల్డ్ ఎహె’ ఔట్ అండ్ ఔట్ […]
ఆస్తుల్లో ఏపీ మంత్రులే టాప్
ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్ 251 కోట్లతో రెండో […]
ఆగస్టు 8న జిఎస్‌టి బిల్లుపై లోక్‌సభలో చర్చ
లోక్‌సభలో సోమవారం జిఎస్‌టి బిల్లుపై చర్చ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అలాగే ప్రధాని ప్రమేయంతో వివిధ రాష్ట్రాల్లోని శాసన సభల్లో కూడా దినికి ఆమోదం లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుకు ఆమోదం ఆరోజే ఆమోదం పొందుతుందని భావిస్తున్నామని ఒక సీనియర్ కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే ఆరోజు జిఎస్‌టి బిల్లుపై ప్రధాని మోడీ చర్చను ప్రారంభిస్తారని తెలిపారు. కాగా ఇప్పటికే రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే! […]
ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా
ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]
టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తున్న బీజేపీకి గందరగోళ పరిస్థితి నెలకొంది. తామొకటి తలిస్తే….కేంద్రంలోని పెద్దలు మరొకటి తలుస్తున్నారని తెలంగాణ కమళనాథులు తెగ ఫీలయిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషయంలో కూడా కావడం ఆసక్తికరంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో […]
మోదుగల హర్ట్ అయ్యార్ట…
రాజకీయాలన్నాక నేతలు అలగడం, వారిని అధిష్టానం బుజ్జగించడం మామూలే. ఏపీ అధికార పార్టీ టీడీపీలోనూ అలిగే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో తనమాటకు విలువ లేకుండా పోయిందని, తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెగ ఫీలైపోతున్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సర్ది చెప్పినా మోదుగుల దిగిరాలేదని సమాచారం. మరి అంతగా ఆయన అలగడానికి […]
గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ అనూహ్యంగా ఎంపికయ్యారు. చివరి క్షణం వరకు నితిన్ భాయ్ పటేల్ అవుతారని ప్రచారం జరిగినా…పార్టీ కేంద్ర పరిశీలక బృదం రూపానీనే ఎంపిక చేసింది. బీజేపీ శాసన సభ్యులతో అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేశ్ పాండేలతో కూడిన పరిశీలక బృందం చర్చించింది. మెజార్టీ సభ్యులు రూపానీ నాయకత్వం వైపే మొగ్గుచూపారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన నితిన్ ఎంపిక చేస్తారనే ప్రచారం ఇవాళ్టితో ముగిసిపోయింది. జైన్ అయిన విజయ్ ఒకప్పుడు […]
కలర్స్ స్వాతి పెళ్లికూతురాయనే!
తెలుగు బుల్లి తెరపై కలర్స్ ప్రోగ్రామ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి స్వాతి.ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, మళియాల ఇండస్ట్రీలో ఓ మెపు మెరిసింది. అష్టాచెమ్మ చిత్రంతో అద్భుత విజయం సొంతం చేసుకున్న ఈ అమ్మడు తర్వాత ఇక ఆగలేదు.అయితే గత కొంతకాలంగా అమ్మడి కెరియర్ కాస్త స్లో అవ్వడంతో ఈ కలర్ ఫుల్ చిలుక ఇపుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెఢీ అవుతుంది.కలర్స్ స్వాతి తన లైఫ్ టర్న్ తీసుకోనుంది. ఎప్పటిలా కాకుండా […]