జబర్దస్త్ కోసం గవర్నమెంట్ జాబ్ వద్దు అనుకున్న కమెడియన్..?

April 23, 2021 at 1:58 pm

ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ దక్కడం అంటే గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళు కృషి చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. అలాంటి గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ని తనకు నచ్చిన రంగంలో రాణించడం కోసం ఒక కమెడియన్ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసాడు. ఆయన మరెవరో కాదు జబర్దస్త్ నటుడు నూకరాజు. పటాస్ షో తో ప్రేక్షకులను అలరిస్తూ మంచి పేరు కొట్టేసిన నూకరాజు జబర్దస్త్ లో కూడా చేస్తున్నాడు.

జిగేల్ జీవన్ టీమ్ లో చేస్తున్న నూకరాజు చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు కానీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే. నటనా రంగం లోకి రాకముందు విజయవాడ పవర్ ప్లాంట్ లో పర్మినెంట్ జాబ్ చేసేవాడు నూకరాజు. జబర్దస్త్ కోసం గవర్నమెంట్ జాబు వదిలేసి వచ్చానని చెప్పాడు. తాను ఒప్పుకున్న షోలకు డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో జాబ్ కి రాజీనామా చేయాల్సి వచ్చిందట.

జబర్దస్త్ కోసం గవర్నమెంట్ జాబ్ వద్దు అనుకున్న కమెడియన్..?
0 votes, 0.00 avg. rating (0% score)