వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!

మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు.

అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఫిదా చేస్తుంటారు. ఇందులోని భాగంగానే తాజాగా తమన్నా ‘కిస్ మీ మోర్’ అనే ఓ ఫుల్‌ బీట్‌ సాంగ్ కి సూపర్ గా డాన్స్ చేసారు. తన డాన్స్ కి సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అయితే ఈ డాన్స్ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోలో తమన్నా అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో, చూపు తిప్పుకోనివ్వని ఎక్స్‌ప్రెష‌న్లతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఐతే ఇదే వీడియో లో తమన్నా పక్కన కొరియోగ్రాఫర్ షజియా సమ్జీ హుషారైన స్టెప్పులు వేసి అలరించారు.