ఏపీలో వైకాపా-కాంగ్రెస్ క‌లుస్తాయా..!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ఫ‌లితాలు దేశ‌రాజ‌కీయ ముఖ చిత్రాన్నేమార్చిన ఘ‌ట‌న‌లు గ‌తంలో చాలానే ఉన్నాయి. హ‌స్తిన పీఠాన్నికాంగ్రెస్‌కు దూరం చేసిన జాతీయ స్థాయి విప‌క్ష కూట‌మి ఏదైనా.. అందులో టీడీపీ పోషించిన కీల‌క పాత్ర‌ను గుర్తుకు తెచ్చేదే. ఒక‌ర‌కంగా కాంగ్రెస్ పార్టీ పంతం ప‌ట్టి మ‌రీ రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించ‌డానికి కూడా టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు పైనా.. ఆ పార్టీలో పేరుకుపోయిన క‌క్షే కార‌ణమ‌ని భావించేవారి సంఖ్య త‌క్కువేమీ కాదు.  రాష్ట్ర విభ‌జ‌న […]

తెలుగు న్యూస్ ఛానెల్స్ రూటు మార‌నుందా

ఎవ‌రు కాద‌న్నా, అవున‌న్నా…   ప్ర‌స్తుతం న‌డుస్తున్నరాజ‌కీయాల్లో ప్ర‌సార మాధ్య‌మాలు పోషిస్తున్న పాత్ర‌ను త‌క్కువ చేసి చూడ‌లేం. అధికారంలో ఉన్న పార్టీలు త‌మ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నా, విప‌క్షాలు చేసే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌పోరాటాలు విజ‌య‌వంతం కావాల‌న్నామీడియా స‌హ‌కారం అత్య‌వ‌స‌రంగా మారిపోయిందిప్పుడు. ఇప్ప‌టికీ ప‌త్రిక‌ల హ‌వా త‌గ్గ‌కున్నా… ప్రజల మీద ప్రభావం చూపించే మీడియా మాధ్యమాల్లో టీవీ ఛాన‌ళ్లు మ‌రింత‌ కీలకంగా మారిపోయిన సంగ‌తి కూడా గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి  చెందుతున్నా అది విద్యావంతుల‌కు మాత్ర‌మే […]

చంద్ర‌బాబులో నాటి జోష్ నేడు ఏమైంది…

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో… ప‌రిపాల‌నాధ‌క్షుడిగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సామ‌ర్థ్యం ఏంటో ఆయ‌న ట్రాక్ రికార్డ్ చెప్ప‌క‌నే చెవుతుంద‌నేది టీడీపీ వ‌ర్గాలు త‌ర‌చూ చెప్పే మాట‌. పైకి ఏం చెప్పినా ఇందులో వాస్త‌వ‌ముంద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా ఒప్పుకునే విష‌య‌మే. అయితే ఈ వాద‌న చంద్ర‌బాబు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పటి కాలానికి వ‌ర్తిస్తుంది కాని…  ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆ స్థాయిలో ప‌ని చేయ‌లేక పోతోంద‌ని ఇపుడు ఏ పార్టీకి సంబంధం లేని త‌ట‌స్థుల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్న […]

ఏపీ సీఎం ఫ్యామిలీ ఆస్తులెన్నో తెలుసా

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబ ఆస్తుల‌ను ఆయ‌న కుమారుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ బాబు బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఇలా పొలిటిక‌ల్‌గా ఓ రేంజ్‌లో ఉన్న నేత త‌న కుటుంబ ఆస్తులు ప్ర‌క‌టించ‌డం దేశంలో చాలా అరుదు. అయితే, చంద్రాబాబు కుటుంబం మాత్రం త‌మ ఆస్తుల వివ‌రాల‌ను వ‌రుస‌గా ఎనిమిదోసారి ప్ర‌క‌టించండం గ‌మ‌నించాల్సిన విషయం. ఇక‌, లోకేష్ చెప్పిన దానిని బ‌ట్టి.. చంద్రాబాబు, ఆయ‌న కుటుంబానికి ఒక్క హెరిటేజ్ ఫ్రెష్ మాత్ర‌మే ఆధారంగా క‌నిపిస్తోంది. దీంతో […]

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా..!

రాజ‌ధాని హైద‌రాబాద్‌లో చెరువులు, న‌ల్లాల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేసిన వారి తాట తీస్తామ‌ని ఇటీవ‌ల కురిసిన కుంభ వృష్టితో హైద‌రాబాద్ మునిగిపోయిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో సొంత పార్టీ నేత‌లు అయినా స‌రే..ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఇలాంటి కేసు విష‌యంలోనే అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌కుమార్‌కి హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. అయితే, ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లో కాకుండా త‌న సొంత […]

కార్పొరేష‌న్ పోరులో జ‌న‌సేన ఎఫెక్ట్ ఎవ‌రికి ఎంత‌..!

తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత ఆ స్థాయిలో ద‌శాబ్దాల‌పాటు సినీ అభిమానుల‌ను ఉర్రూతలూగించి తిరుగులేని అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న ఘ‌నత చిరంజీవిది. ఆ ధైర్యంతోనే ఎన్టీఆర్ బాట‌లోనే తానూ సొంతంగా రాజ‌కీయ‌ పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆశించిన చిరంజీవికి రాజ‌కీయాల్లో మాత్రం గ‌ట్టి ఎదురుదెబ్బ‌నే రుచిచూడాల్సి వ‌చ్చింది. సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా రాణించిన చిరంజీవి రాజ‌కీయాల్లో మాత్రం వెనుక‌బెంచీ విద్యార్థిగానే ఉండిపోయారు. చిరంజీవి రాజ‌కీయాల్నిన‌మ్ముకుని సినీరంగాన్ని వీడ‌టంతో స‌హ‌జంగానే ఆయ‌న అభిమాన గ‌ణ‌మంతా […]

కేసీఆర్ కోరిక బాబు తీరుస్తాడా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాన్య ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల మాట‌ల మ‌రాఠీగానే చాలామందికి తెలుసు. కానీ ఆయ‌నకు మ‌త ప‌ర‌మైన న‌మ్మ‌కాలు, సెంటిమెంట్లు, వాస్తు ప‌ట్టింపులు కూడా బాగా ఎక్కువ‌ని ఆయ‌న స‌న్నిహితులకు మాత్ర‌మే తెలుసు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోస‌మంటూ ఆయ‌న భారీగా నిర్వ‌హించిన‌  చండీయాగం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌డం కోసం ఈ యాగం నిర్వ‌హిస్తారు. ఈ యాగం ఫ‌లితంగానే అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి తెలంగాణ క‌ల సాకార‌మైంద‌ని […]

అడ్డంగా బుక్ అయిన టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే

ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌వాళ్లు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాలి. ఒక‌వేళ వీలు కాక‌పోతే వారికి న‌చ్చ‌చెప్పుకోవాలి. లేదా ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉద్య‌మానికి దిగాలి. ఇది ఎక్క‌డైనా ఉన్న ప‌ద్ధ‌తి. కానీ, ఈ ప‌ద్ధ‌తిని ప‌క్క‌న పెట్టిన తెలంగాణ‌లోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డం కోసం, ప్ర‌జ‌ల ఆగ్ర‌హం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం కోసం భ‌లే గిమ్మిక్కు ప్లే చేశారు. త‌న‌కు టికెట్ ఇచ్చి, విప్ హోదా ఇచ్చి గౌర‌వించిన ప్ర‌భుత్వ అధినేత‌నే బోనులో ఇరికించేశారు. త‌న […]

లోకేష్‌కు గుడ్ న్యూస్‌…ఆమెకు బ్యాడ్ న్యూస్‌

లోకేష్‌కు ప్ర‌భుత్వంలో ప‌దవులిచ్చే అంశాన్నిముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టినా… లోకేష్ రాజ‌కీయ అరంగేట్రం  పేరు చెపితేనే విప‌క్ష వైసీపీ ఉలికిప‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీంతో లోకేష్ పేరు చెపితేనే జ‌గ‌న్ భ‌య‌పడుతున్నార‌ని… జ‌గ‌న్‌కు దీటైన ప్ర‌త్య‌ర్థి లోకేషేన‌ని, విప‌క్ష వైఖ‌రి చూశాక  టీడీపీలో యువ నాయ‌కులు ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అందుకే లోకేష్‌కు ప్ర‌భుత్వంలో స‌ముచిత ప‌ద‌వినివ్వాల‌ని పార్టీ నేత‌లు మ‌రోసారి ముఖ్య‌మంత్రిని క‌లిసి చెప్పిన‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబు పాల‌నా వ్య‌వ‌హారాల్లో తీరిక లేకుండా గ‌డుపుతుండ‌టంతో […]