విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరు పోటీ చేస్తారో తెలుసా…?

రాజకీయాలకు పుట్టిలుగా విజయవాడకు పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయవాడ పార్లమెంట్ సహా ఏపీ – తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల గురించి ఎక్కువగానే చర్చ జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అందులో 3 విజయవాడ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఇక రెండు నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతూనే ఉంటాయి. తాజాగా విజయవాడ పార్లమెంట్ సహా పరిధిలోని […]

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా….!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలలు గడువుంది. 2019 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగగా… మళ్లీ 2024 ఏప్రిల్ వరకు జగన్ సర్కార్‌కు గడువుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా అప్పుడే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తొలి నుంచి ప్రతిపక్షాలు తమ శ్రేణులను అలర్ట్ చేస్తున్నాయి. అటు అధికార పార్టీ నేతలు సైతం… ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే ప్రకటనలు […]

పవన్ మూడో విడత వారాహి యాత్ర.. ముహుర్తం ఖరారైందా…!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలనేది పవన్ లక్ష్యం. ఇందుకోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని కూడా పవన్ వెల్లడించారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్… 2019 ఎన్నికల్లో మాత్రం కమ్యునిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. కానీ కేవలం ఒక్కటే నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచింది. రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ సైతం ఇప్పుడు వైసీపీకి […]

గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!

ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో […]

ఆ రెండు పార్టీలకు ఫుల్ పబ్లిసిటీ… మరి తమ్ముళ్ల పరిస్థితి….!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే బ్రో సినిమా. వాస్తవానికి ఆ సినిమాలో కేవలం ఓ రెండు నిమిషాల సేపు మాత్రమే పృద్వీరాజ్ క్యారెక్టర్. అది కూడా ఓ పాటలో భాగం. అక్కడ పృద్వీ వేసే డ్యాన్స్…. ఆ సీన్‌లో పవన్ చెప్పే డైలాగ్‌ ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్. పృద్వీ వేసిన స్టెప్పులు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల చుట్టూ అంబటి రాంబాబు వేసినట్లుగా ఉందని అంతా పోల్చారు. […]

మంగళగిరికి మకాం మార్చేసిన పవన్ కల్యాణ్‌….!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరికి మకాం మార్చారు… నిన్న, మొన్నటి వరకూ హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మంగళగిరికి తరలించారు. ఇక సినిమా షూటింగ్‌లకు మాత్రమే పవన్‌ కళ్యాణ్‌  హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జనసేన తన కార్యకలాపాలను ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించనుంది. ఇప్పటికే పార్టీ కేంద్ర  కార్యాలయంతో పాటు, జనసేనాధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా మంగళగిరికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కేంద్ర […]

ఆదిరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టినట్లేనా….!

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఏమయ్యారు… ఆమె ఎక్కడ ఉన్నారు… రాజమండ్రి సిటీ పరిధిలో పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ… ఎమ్మెల్యే మామ… మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చంద్రబాబు అవకాశం ఇస్తారా… ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలివే. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భవానీ… వైసీపీ హవాలో […]

ఆ నలుగురే కీలకం… ఇలా అయితే ఎలా సారూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు […]

జగన్ బాటలో కేసీఆర్… సక్సెస్ అవుతారా….!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ… 2009లోనే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన జగన్… ఆ తర్వాత వైసీపీ స్థాపించారు. 2012 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న జగన్… 2019లో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సీటు దక్కించుకున్నారు. తొలి నుంచి తనదైన శైలిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు జగన్. […]