తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మరో మూడు రోజులపాటు ఉంటున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే సిటీకి తిరిగి రావాల్సి ఉంది. అయితే మోదీ, అమిత్ షాలను కలిసిన తరువాతే రావాలని ఆయన అనుకుంటున్నట్లు తెలిసింది. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే పీఎంఓను అధికారులు సంప్రదించారు. పీఎంఓ ఓకే అంటే.. మోదీని కలిసి ఆ […]
Author: admin
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఖజానాకు కొత్త ఆదాయం..?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే విధంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కు సంబంధించి చార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా మద్యం షాపులను పెంచి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఖజానా నింపనుంది. కొత్త గా తీసుకున్న ఈ నిర్ణయం మందుబాబులకు లో ఉత్సాహాన్ని రేపుతోంది. ఖజానా నింపడం కోసం కొత్తగా 225 వైన్ షాప్ లను ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం […]
వాళ్లు సరే.. మరి వీరెందుకు వచ్చారు..?
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య విజయమ్మ హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోలేదు. షర్మిల పార్టీకి పెద్దగా మద్దతూ ఎవరూ ప్రకటించారు. అందరూ తమకు వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధం మాత్రం గుర్తుచేసుకున్నారంతే. ఈ సమావేశానికి టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ సీనియర్ నాయకులను ఆహ్వానించినా వారు తెలివిగా తప్పించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్న నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి,ఉండవల్లి అరుణ్ కుమార్, గిరీష్ సంఘి […]
పీకే : తూట్లు పడ్డ నావకి తెడ్డు వేస్తాడా?
తెలుగు రాజకీయాలకు సంబంధించినంత వరకు పీకే అంటే పవన్ కల్యాణ్ అనుకుంటారు గానీ.. యావద్దేశం దృష్టిలో పీకే అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఎన్నికల్లో పార్టీలను అలా సునాయాసంగా అధికారంలోకి తీసుకువచ్చేసే మంత్రం తెలిసిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ కు పేరుంది. ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా దీదీ కోసం పనిచేసి.. ఆమెను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రశాంత్ కిశోర్ .. ఇక రాజకీయ వ్యూహరచనల ప్రస్థానం చాలిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. తాజాగా ఆయన […]
హస్తినలో అధినేత సైలెంట్.. ఎందుకో..?
దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన.. గులాబీ శ్రేణుల సంబరాలు.. రాష్ట్రం నుంచి ముందుగానే హస్తినకు చేరుకున్న కార్యకర్తలు, నాయకులు.. వర్షం వస్తున్నా హంగామా.. సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ఏర్పాట్ల పర్యవేక్షణ.. ఇంత పెద్ద.. గొప్ప ప్రారంభ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీ వేదికగా పార్టీకి ఏం దిశానిర్దేశం చేస్తారో? దేశానికి టీఆర్ఎస్ తరఫున ఏం చెబుతారో? అని అందరూ ఎదురు చూశారు. ముఖ్యంగా జాతీయ మీడియా కేసీఆర్ […]
అన్న దూరం పెట్టినోళ్లంతా చెల్లెలు చెంతకు..!
కారణాలు ఏవైనా కావొచ్చు గాక.. అన్నయ్య వారిని దూరం పెట్టాడు. ఒకప్పట్లో వారందరూ కూడా ఆ అన్నయ్య కోసం, అన్నయ్యను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం కోసం అహరహమూ పరితపించిన వారే. కానీ.. వారందరినీ అన్నయ్య దూరం పెట్టాడు! కాలక్రమంలో వారిలో చాలా వరకు తెరమరుగే అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వారందరికీ కొత్త ఆదరవు దొరికినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చూపిస్తానంటూ షర్మిల పెట్టిన రాజకీయ పార్టీకి ఎవరెవరి మద్దతు ఉండబోతోందో […]
తెలుగు సీఎంలూ.. స్టాలిన్ నుంచి నేర్చుకోండి..!
అరవయ్యేళ్లు దాటిపోయేవరకు పార్టీకి యువనేతగానే మిగిలిపోయిన స్టాలిన్.. ఈ వయసులో దక్కిన ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఒక మోడల్ అనిపించేలాగా.. నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే.. మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల ఇళ్లకు వెళ్లి పలకరించి.. ప్రభుత్వానికి సహకరించమని అడగడం దగ్గరినుంచీ.. నిన్న మొన్న ఎన్నికలకు ముందు స్కూలు పిల్లలకోసం అప్పటి సీఎం బొమ్మలతో తయారుచేసిన బ్యాగులపై […]
పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?
‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు […]
పాలి’ట్రిక్స్‘ లో ప్రశాంత్ కిశోర్..
ప్రశాంత్ కిశోర్.. రాజకీయవర్గాల్లో ఎప్పుడూ నానుతూ ఉండే పేరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేక ఎన్నికలు సమీపిస్తున్నా ప్రశాంత్ కిశోర్ (పీకే) పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు బీజేపీకి మద్దతుగా నిలిచి మోదీని అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి సర్వశక్తులూ ఒడి అనుకున్నది సాధించి.. ఆ తరువాత జగన్ వైపు వచ్చి ఆయననూ సీఎం సీటుపై కూర్చోబెట్టారు. ఆ తరువాత చాలా మంది ఈయన మద్దతు తీసుకొని విజయం సాధించారు. తెలంగాణలో కూడా వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పీకే […]









