ఒక సినిమా తో మరొక సినిమా సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నాడు సత్యదేవ్. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సత్యదేవ్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. హీరోగా మారిన తన పంథా మార్చుకోలేదు సత్య దేవ్. నచ్చితే వెబ్ సిరీస్ చేయడమే కాకుండా కేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా చేస్తున్నాడు. ఇటీవలే స్కైలాబ్ అనే డిఫరెంట్ మూవీతో ముందుకొచ్చిన […]
Author: admin
మళ్లీ కెమెరాకు చిక్కిన టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్..!
సందు చిక్కినప్పుడల్లా ముంబై వీధుల్లో దర్శనమిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో రష్మిక ఛలో సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఆమె తన రెండో సినిమాగా విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. వీరిద్దరి కెరీర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి […]
తమిళనాడులో పుష్ప ఫైర్.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు..!
అల్లు అర్జున్- రష్మిక మందన్న- సుకుమార్ కాంబినేషన్లో తాజాగా విడుదలైన మూవీ పుష్ప. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అయితే తమిళనాడులో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మామూలుగా తమిళ సినిమాలు ఎక్కువగా రియలిస్టిక్ గా తెరకెక్కుతుంటాయి.తమిళ సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ లో […]
తమిళనాడు ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్ వరుసగా ప్రజా ఆమోద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాలనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదం బారిన పడి గాయాలపాలైన వారికి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన వారికి ఆపరేషన్లు కూడా చేయాల్సి […]
ఇప్పుడే వద్దు.. కాస్త ఓపిక పట్టండి..
ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. గురువారం ఢిల్లీలో సోనియాను కలిసి డీఎస్..శుక్రవారం పార్టీలో చేరాల్సి ఉంది. అయితే.. ఎందుకో డీఎస్ కాంగ్రెస్‌కు కండువా కప్పే విషయంపై కాంగ్రెస్ నాయకులు, హైకమాండ్ ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని, అందుకే వాయిదా పడిందని తెలిసింది. పార్టీలో చేరే తేదీని తరువాత చెబుతామని.. అంతవరకు ఓపిక పట్టాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ […]
గరం..గరం..గద్వాల రాజకీయం
డీకే అరుణ.. అప్పట్లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. అయితే ఇప్పుడు అరుణ సొంత నియోజకవర్గం (గద్వాల) ఎమ్మెల్యే అయిన తన మేనల్లుడు బండ్ల క్రిష్ణ మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించారు. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ […]
జనంలో కాదు సోషల్ మీడియాలో యాక్టివ్
ఆర్‌కే అలియాస్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు వింటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఓ భరోసా.. ఓ నమ్మకం.. అయితే ఇది ఇప్పుడు కాదు.. గతంలో..ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలుపొందిన నాటి సంగతి. ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడి 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. కేవలం 12 ఓట్లతో మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికై వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత జనం కోసం నిలబడి వారి మద్దతు కూడగట్టాడు. […]
కేటీఆర్ సార్.. మేయర్ గారెక్కడ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్లందరికీ కాదు కదా సొంతపార్టీ కార్పొరేటర్లకు కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి అందుబాటులో ఉండటం లేదు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మేయర్ ను కలిసి వివరిద్దామనుకుంటే వారికి నిరాశే ఎదురవుతోంది. మాకే మేయర్ అందుబాటులో లేకపోతే మేం ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించగలం? అని వాపోతున్నారని సమాచారం. 2021 ఫిబ్రవరిలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి పేరు బయటకు రావడం.. ఆమెను […]
పుష్ప రిలీజైతే.. మహేష్ కి పోటెత్తుతున్న కంగ్రాట్స్..!
ఎన్నో అంచనాల మధ్య ఇవాళ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు భాషల్లో మూడు వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తెలంగాణలో ఇప్పటికే బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. మార్నింగ్ షో కూడా వేశారు. ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలు పడలేదు. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే పుష్ప సినిమాపై హిట్టా -పట్టా అనే విషయమై టాక్ వస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇరగదీసాడని […]









