తమిళనాడులో పుష్ప ఫైర్.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు..!

అల్లు అర్జున్- రష్మిక మందన్న- సుకుమార్ కాంబినేషన్లో తాజాగా విడుదలైన మూవీ పుష్ప. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అయితే తమిళనాడులో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మామూలుగా తమిళ సినిమాలు ఎక్కువగా రియలిస్టిక్ గా తెరకెక్కుతుంటాయి.తమిళ సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ లో విడుదలై విజయం సాధిస్తూ ఉంటాయి.

అక్కడి హీరోలు రజనీకాంత్, కమలహాసన్, విక్రమ్, సూర్య, విశాల్, కార్తీ తదితర హీరోలో తెలుగులో కూడా విజయాలు సాధించి స్టార్ డం అందుకున్నారు. అయితే తెలుగు సినిమాలు తమిళ్ లో డబ్ అయిన ప్పటికీ చాలా తక్కువ శాతమే విజయాలను అందుకుంటూ వుంటాయి. అయితే పుష్ప సినిమా తమిళ స్టయిల్లో తెరకెక్కడంతో అక్కడి వారికి ఈ సినిమా నచ్చింది. తమిళనాడులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 13 కోట్లు రావాల్సి ఉండగా.. తొలి మూడు రోజుల్లోనే పుష్ప సినిమా 11. 25 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇంకో ఒకటి రెండు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ లాభాల బాటలో పయనించనుంది. బాహుబలి తర్వాత తమిళ్ లో ఆ స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమా ఇదే. తమిళనాడులో పుష్ప మొదటిరోజు 3.65 కోట్ల వసూళ్లు సాధించగా, రెండవ రోజు 3.25కోట్లు, మూడో రోజు 4.35 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే మూడో రోజు ఈ సినిమాకు అనూహ్యంగా ఈ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రావడం కనిపించింది. ఇదేవిధంగా అక్కడ పుష్ప వసూలు సాధిస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. పుష్ప సినిమా ఓవరాల్ గా మిశ్రమ స్పందనతోనే కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.