ఎన్నో అంచనాల మధ్య ఇవాళ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు భాషల్లో మూడు వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తెలంగాణలో ఇప్పటికే బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. మార్నింగ్ షో కూడా వేశారు. ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలు పడలేదు. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే పుష్ప సినిమాపై హిట్టా -పట్టా అనే విషయమై టాక్ వస్తోంది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇరగదీసాడని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ తన నటనతో సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లాడని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ స్లోగా నడుస్తుందని, సినిమా నిడివి కూడా మైనస్ గా మారిందని, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో విఫలం అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా పుష్ప విడుదల తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ పోస్ట్ లతో చెలరేగుతుండగా.. ఆశ్చర్యకరంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పుష్ప పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. దానికి కారణం మహేష్ బాబు పుష్ప సినిమాను రిజెక్ట్ చేసినందుకే. సుకుమార్ ఈ కథను మొదట మహేష్ బాబుకు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ కథను రిజెక్ట్ చేయడంతో.. ఆ తర్వాత సుకుమార్ బన్నీ కి కథ వినిపించి ఒప్పించాడు.
పుష్ప సినిమా రిజెక్ట్ చేసినందుకు ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మీరు ఆ సినిమా చేయకపోవడమే మేలైందని కామెంట్స్ చేస్తున్నారు. కథాపరంగా సుకుమార్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయనతో సినిమా చేయడం లేదని.. 2019 మార్చి 4వ తేదీన మహేష్ బాబు చేసిన ట్వీట్ ను ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ మళ్లీ వైరల్ చేస్తున్నారు.
Thanks for rejecting #Puspha@urstrulyMahesh Anna ?#PushpatheRise pic.twitter.com/P6MowgnDIS
— Røyãl jãveed (@Itzzz_zoy) December 17, 2021