నెల్లూరులో జగన్ రివర్స్ ఆపరేషన్..వైసీపీలోకి కీలక నేత.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోకి పలువురు కీలక నేతలు రావడం…అటు నారా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టి‌డి‌పి వైపుకు వచ్చారు. దీంతో నెల్లూరులో టి‌డి‌పికి బలం పెరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ సైతం రివర్స్ ఆపరేషన్ చేస్తుంది. నెల్లూరులో ఏ మాత్రం బలం తగ్గకుండా చూసుకుంటూ ముందుకెళుతుంది. ఈ […]

రాహుల్‌కు కౌంటర్లు..రేవంత్ తగ్గట్లేదు.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో పాటు 50 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు..రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇక బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పి బీటీమ్ అంటూ విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పలు హామీలని ప్రకటించింది. ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చి దూకుడు మీద ఉంది. […]

కలహాల కమలం..వరుస పంచాయితీలు..తేలని పదవులు.!

కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. ఎక్కడైనా అంతర్గతంగా పోరు ఉంటుంది..కానీ కాంగ్రెస్ లో మాత్రం బహిరంగంగానే పోరు ఉంటుంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అలా చేయడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో అలాంటి రచ్చ కాస్త తగ్గింది..ఇప్పుడు బి‌జే‌పిలో మొదలైంది. బి‌జే‌పిలో ఇలాంటి పోరు పెద్దగా జరగదు. ఏమైనా ఉన్న అధిష్టానం సర్ది చెప్పేస్తుంది. కానీ తెలంగాణ బి‌జే‌పిలో ఇప్పుడు ఆ పరిస్తితి […]

టీడీపీ సూపర్ సిక్స్..ప్రజల్లోకి వెళుతున్నాయా?

నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదమనే సంగతి తెలిసిందే.అందుకే చంద్రబాబు గట్టిగా కష్టపడుతూ…పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో మహానాడులో మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ అంటూ ఓ ఆరు అంశాలతో మేనిఫెస్టో రూపోదించారు. అయితే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టి‌డి‌పి నేతలు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో […]

ఆ పదవులతో ఎమ్మెల్యేలకు చిక్కులు..గ్రాఫ్ డౌన్..!

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుయ బాగోలేదని స్వయంగా జగన్ చెప్పిన విషయం తెలిసిందే. పనితీరు బాగోని వారిని పక్కన పెట్టేసి..వారి స్థానాల్లో కొత్త అభ్యర్ధులని బరిలో దించుతామని జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే పనితీరు బాగోలేదని 18 మంది ఎమ్మెల్యేల గురించే మాట్లాడారు గాని…ఆ పార్టీలో దాదాపు 50 మంది వరకు పనితీరు బాగోలేదని తెలిసింది. దీంతో జగన్ ఎంతమందికి టికెట్లు ఇవ్వకుండా ఉంటారో అర్ధం కాకుండా ఉంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు..పార్టీ […]

నెల్లూరు రూరల్‌లో లోకేష్‌కు భారీ మద్ధతు..తొలి విజయం దిశగా.!

నెల్లూరు రూరల్ నియోజకవర్గం డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఇక్కడ గత రెండు ఎన్నికల్లో వైసీపీదే విజయం. అంతకముందు ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆనం వివేకానందరెడ్డి గెలిచారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ నెల్లూరు రూరల్.. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇంతవరకు టి‌డి‌పి గెలవలేదు. అయితే టి‌డి‌పికి 2019లోనే డైరక్ట్ పోటీ చేసింది. 2009లో టి‌డి‌పి పొత్తులో భాగంగా సి‌పి‌ఐ పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. 2014లో టి‌డి‌పితో పొత్తులో […]

దొంగ ఓట్ల కలకలం..పిల్లలకు కూడా ఓట్లు..!

ఏపీలో దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10 వేల వరకు దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని పెద్ద ఎత్తున కథనాలు రావడం సంచలనంగా మారింది. అది కూడా అధికార వైసీపీనే ఈ దొంగ ఓట్ల సృష్టికర్త అని ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ..అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ..వాలంటీర్లని ఉపయోగించుకుని దొంగ ఓట్లు సృష్టించడం..అలాగే టి‌డి‌పి సానుభూతి పరుల ఓట్లని తొలగించడం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా టి‌డి‌పి కంచుకోట అయిన […]

రాహుల్‌తో హస్తం జోరు..కేసీఆర్‌ని నిలువరిస్తారా?

మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ పార్టీలో జోరు పెరిగింది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఆ పార్టీకి కొత్త చేరికలు భారీ ప్లస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు…కాంగ్రెస్ లోకి రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఖమ్మంకు రాహుల్ గాంధీ వచ్చారు. ఖమ్మంలో జరిగిన సభలో […]

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు..జగన్ ప్లాన్ ఏంటి?

18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు తిరగడం లేదని, వారి పేర్లు చెప్పను గాని…వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని ఇటీవల సమీక్షా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే పైకి చెప్పింది 18 మంది ఎమ్మెల్యేలు…అసలు వైసీపీలో పనితీరు దారుణంగా ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నారట. వారికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మామూలుగా గడపగడపకు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధం లేదనే చెప్పాలి. గడపగడప అంటే కేవలం..ప్రభుత్వ పథకాల అందుతున్న లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి..మీకు […]