వైనాట్ పులివెందుల..బాబు పగటి కలలు..!

టి‌డి‌పి అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనకు వెళ్ళి..అక్కడ పూల అంగళ్ళ సెంటర్‌లో సభ నిర్వహించారు. సభకు ఓ మాదిరిగానే జనం వచ్చారు. అయితే కేవలం పులివెందుల వాళ్ళు మాత్రమే కాదు..చుట్టూ పక్కల నియోజకవర్గాల వారు వచ్చారు. అయితే ఇంకా ఆ జనం చూసి..పులివెందుల పసుపుమయం అయిపోయిందని టి‌డి‌పి శ్రేణులు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వై నాట్ పులివెందుల అంటూ బాబు నినదించారు. అంటే పులివెందులని కూడా టి‌డి‌పి గెలుస్తుందనే ఉద్దేశంతో మాట్లాడారు. మరి అది […]

పరిటాల ఫ్యామిలీకి మళ్ళీ లక్ లేదా? రెండు పోతాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దివంగత పరిటాల రవీంద్ర అనంతలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన మరణం తర్వాత సునీతమ్మ సత్తా చాటారు. కానీ పరిటాల వారసుడు శ్రీరామ్ విజయాలని కొనసాగించలేకపోయారు. తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో రాప్తాడు బరిలో దిగి ఓడిపోయారు. తర్వాత పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు రెండు సీట్ల బాధ్యతలు ఇచ్చారు. సునీతమ్మకు రాప్తాడు, శ్రీరామ్‌కు ధర్మవరం బాధ్యతలు ఇచ్చారు. దాదాపు వీరి […]

వెస్ట్‌లో తమ్ముళ్ళ కుమ్ములాట..మళ్ళీ వైసీపీ వశమే.!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట..కానీ వైసీపీ కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా వైసీపీ హవా నడిచేలా ఉంది. టి‌డి‌పి-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ఆధిక్యం ఖాయం. ఒకవేళ పొత్తు ఉంటే వైసీపీ గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది. అయితే టి‌డి‌పి కొన్ని సీట్లలో, జనసేన కొన్ని సీట్లలో బలపడింది. […]

అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!

ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి. ఇప్పటికే టి‌డి‌పి నుంచి నారా […]

కడప-కర్నూలు మళ్ళీ వన్‌సైడ్..కానీ స్వీప్ డౌట్.!

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు..వైసీపీ కంచుకోటలు. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తుంది. 2014లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్నా..ఈ రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు, టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక కర్నూలులో 14 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మాత్రం రెండు జిల్లాల్లో వైసీపీ స్వీప్ […]

ఏపీ అప్పులపై కేంద్రం అలా..పురందేశ్వరి ఇలా..ఏది నిజం.!

ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని, ఈ నాలుగేళ్లలో దాదాపు ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు చేరాయని చెప్పి  టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పిలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక సుమారు లక్ష కోట్ల వరకు అప్పులు ఉంటే..చంద్రబాబు హయాంలో  2 లక్షల కోట్లపైనే అప్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఇక జగన్ వచ్చాక దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శలు వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం 2 లక్షల కోట్లు లోపే […]

ఆ వారసులకు జగన్ లైన్ క్లియర్..?

వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. కుదిరితే తమ వారసులతో పాటు తాము సీటు తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇంకా వారసులకు సేతు ఫిక్స్ చేయలేదు. సీనియర్ నేతలని నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తనతో పాటే పోటీ చేయాలని అంటున్నారు. దీంతో వారసుల అంశం తేలడం లేదు. ఇప్పటికే పలువురు వారసులు సీటు రేసులో ఉన్నారు. ధర్మాన […]

బాబు ప్రాజెక్టు పాలిటిక్స్..జనం నమ్ముతారా?

జగన్ ప్రభుత్వం టార్గెట్ గా గత నాలుగేళ్లుగా చంద్రబాబు విమర్శనస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. సందు దొరికితే చాలు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ విరుచుకుపడుతున్నారు. జగన్ మంచి చేసిన వాటిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు కొత్త రూట్ వెతుక్కున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని, అసలు ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టలేదని, తమ హయాంలోనే భారీగా ఖర్చు పెట్టమని ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి […]

ఎన్నికల వరాలు..కేసీఆర్ పక్కా ప్లాన్.!

మొత్తానికి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వం..ప్రజలపై వరాల జల్లు కురిపించింది. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో..ప్రజలని ఆకర్షించే విధంగా కే‌సి‌ఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. ఈ అంశం రాజకీయంగా కూడా బి‌ఆర్‌ఎస్ […]