అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాజాగా సిఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి బటన్ నోక్కారు. ఇదే సమయంలో కోనసీమలో రాజకీయంగా వైసీపీ పట్టు తగ్గకుండా ఉండేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే అమలాపురం అసెంబ్లీలో మంత్రి పినిపే విశ్వరూప్ సీటు విషయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో విశ్వరూప్, […]
Author: Krishna
టీడీపీ-జనసేన నెక్స్ట్ ఉగాదికి ఉండవా?
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే కాన్ఫిడెన్స్ లో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెబుతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్రెస్ ఉండవని మాట్లాడుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే..మళ్ళీ ప్రజలు జగన్‌కు అండగా నిలబడతారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి..వచ్చే ఉగాదికి టిడిపి-జనసేనలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, […]
విశాఖపైనే పవన్ గురి.. వైసీపీకి రిస్క్ పెంచుతారా?
పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్రని విశాఖలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. విశాఖ జగదాంబ సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. తర్వాత రిషికొండకు వెళ్ళి..అక్కడ సిఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణాలని పరిశీలించారు. ఇక వరుసగా విశాఖలో పవన్ పర్యటించనున్నారు. రోడ్ షోలు, భారీ సభలు ఏర్పాటు చేయనున్నారు. టోటల్ గా విశాఖపైనే పవన్ గురి పెట్టారు. దసరాకు జగన్ విశాఖ నుంచే పాలన మొదలుపెడుతున్న నేపథ్యంలో పవన్..విశాఖలో పర్యటించడం చర్చనీయాంశమైంది. అక్కడ వైసీపీకి చెక్ […]
పాతపట్నం సీటు ఎవరికి? సీనియర్ వర్సెస్ జూనియర్.!
తెలుగుదేశం పార్టీ వేగంగా పుంజుకుంటున్న సీట్లలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం కూడా ఒకటి. ఇటీవల సర్వేల్లో ఇక్కడ టిడిపికి ఆధిక్యం ఉందని తేల్చి చెప్పాయి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వరుసగా వైసీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా అతి త్వరగా ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అటు తన వారసుడు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అటు వంశధార నిర్వాసితులకు న్యాయం జరగలేదు. అభివృద్ధి […]
సీటు రాకపోతే ఇండిపెండెంట్..టీడీపీ-జనసేనలో కొత్త రచ్చ.!
టీడీపీ-జనసేన పొత్తు కొత్త సమస్యకు దారి తీసేలా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు కానీ..కింది స్థాయిలో రెండు పార్టీల శ్రేణులు ఎంతవరకు కలుస్తాయి. ఎంతవరకు సహకరించుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. సీటు తమకంటే తమకని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ఒక పార్టీకి సీటు దక్కితే మరొక పార్టీ నేత ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు కూడా […]
పుంగనూరు కేసులు..చల్లా-నల్లారిపైనే గురి..వైసీపీకి ప్లస్సేనా?
ఇటీవల చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో తంబళ్ళపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ, టిడిపి శ్రేణుల మధ్య దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే టిడిపి శ్రేణులని బాబు రెచ్చగొట్టి..వైసీపీ, పోలీసులపై దాడులు చేయించారని చెప్పి వైసీపీ నేత కేసు పెట్టగా, చంద్రబాబుతో సహ టిడిపి నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ రెండు చోట్ల ఏం జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. మొదట తంబళ్ళపల్లెలో బాబు టూర్ ఉంటే..వైసీపీ శ్రేణులు ఎందుకు […]
బాబు-పవన్ ఎటాక్..జగన్‌కు లాభమే.!
ఏపీలో ప్రతిపక్ష నేతలు జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ..జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు. మొదట టిడిపి చంద్రబాబు..ప్రజల్లో తిరుగుతూ రోడ్ షోలు, సభలు అంటూ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక బాబు బ్రేక్ ఇవ్వగానే పవన్ వారాహి యాత్ర అని స్టార్ట్ చేశారు. ఆ యాత్రలో జగన్, వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పవన్ గ్యాప్ తీసుకోగానే బాబు ఎంట్రీ ఇచ్చారు. సాగునీటి […]
టీడీపీలోకి శ్రీదేవి..సీటుపై ఆశలు లేనట్లే.!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..టీడీపీలో చేరడం ఖాయమైంది. తాజాగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిశారు. మొన్న ఆ మధ్య వైసీపీ శ్రేణులు తనపై మాటల దాడి చేయడం, తన పార్టీ ఆఫీసులపై దాడి చేసినప్పుడు చంద్రబాబు, లోకేష్ తనకు మద్ధతుగా నిలించారని అందుకే కృతజ్ఞత తెలుపుకోవడానికి బాబుని కలిశానని శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఆలోచించుకున్నానని, ఏపీలో టిడిపి హవా ఉందని, టిడిపితోనే న్యాయం జరుగుతుందని, అందుకే యువగళం […]
గోదావరి జిల్లాలపైనే జగన్ గురి..వైసీపీకి ఆధిక్యం?
గోదావరి జిల్లాలు..రాజకీయంగా ఈ జిల్లాల్లో పట్టు సాధించిన పార్టీకి తిరుగుండదు. ఈ జిల్లాల్లో ఆధిక్యం సాధిస్తే అధికారం దక్కించుకోవడం సులువే. ఎందుకంటే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉంటాయి. తూర్పులో 19, పశ్చిమలో 15 సీట్లు ఉన్నాయి. ఈ 34 సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి రావడం సులువే. 2014లో ఈ జిల్లాల్లో టిడిపి ఆధిక్యం దక్కించుకుంది. 2019లో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. 34 సీట్లకు 27 […]