పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. కామెడీ సినిమాల డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించడంతో.. ఆడియన్స్‌కు మొదట్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. మెల్లమెల్లగా హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టు సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ అయితే.. ఆడియన్స్‌ను కట్టుకోవడంతో మరింత జోష్ పెరిగింది. ట్రైలర్లో వింటేజ్ లుక్ లో ప్రభాస్ అదరగొట్టాడని చెప్పాలి.

ఇక ఫస్ట్ సింగల్ ప్రోమో రీసెంట్గా వచ్చి మరింత ఆశక్తి పెంచేసింది. ఇక.. ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమా బిజినెస్ గురించి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ అయినా మొదలుపెట్టక ముందే భారీ లెవెల్లో బిజినెస్ జరుగుతుందని సమాచారం. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో కంప్లీట్ చేశారు. ఇక.. ఇప్పుడు సినిమా బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాలను షాక్ చేస్తుందని.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా థియేటర్ కల్ బిజినెస్ రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందట. ఇందులో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి రూ.160 కోట్లు థియేట్రికల్ హక్కులు అమ్మడైనట్లు టాక్ వైరల్ గా మారుతుంది.

రాయలసీమతో కలిపి.. మొత్తం రూ.200 కోట్లకు అమ్ముడయ్యే అవకాశం ఉందట. ఇక.. నార్త్ లో ఈ సినిమాకు రూ.75 కోట్లు మేరా బిజినెస్ జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఓవర్సీస్ లో ఇప్పటికే బిజినెస్ డీల్ కంప్లీట్ అయి ఓపెన్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. నార్త్ అమెరికాలో సినిమా హక్కులను ప్రత్యంగిరా సినిమా 9 మిలియన్ డాలర్లకు దక్కించుకొని గుడ్ రిటర్న్స్ అందుకున్నారు. ప్రభాస్ గత సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో సినిమాకు బిసినెస్ జరుగుతుంది. నార్త్ అమెరికా ప్రభాస్ సినిమాలకు స్ట్రాంగ్ కోటగా మారింది. గతంలో.. ప్రభాస్ నటించిన బాహుబలి నుంచి కల్కి 2898 వరకు అన్ని సినిమాలకు భారీ వసూళ్లు దక్కాయి. ఇక.. మరోపక్క ఈ సినిమాకు ఓటీటీ డీల్ కూడా కంప్లీట్ అయ్యింది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ జియో హాట్‌స్టార్ రూ.140 కోట్లకు ఈ సినిమా ఓటింగ్ హక్కులను దక్కించుకుందని టాక్. ఈ లెక్కన రిలీజ్ కి ముందే రూ.500 కోట్లకు పైగా జరిగిందంటే.. రాజాసాబ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

