టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్గా తిరగలేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వాళ్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న చాలామందికి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన రికార్డ్ పూరి జగన్నాథ్‌కు సొంతం. అంతేకాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఘనత కూడాపూరి జగన్నాథ్‌కే సొంతం. డేరింగ్ అండ్ డాషింగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు తెరకెక్కించిన ఏ ఒక్క సినిమా కూడా రెండు మూడు నెలలు మించి షూటింగ్ చేసుకోలేదు.
ఎంత పెద్ద స్టార్స్‌తో అయినా కూల్‌గా ప్రాజెక్ట్ డీల్ చేయగల పూరి.. తన సినిమాల్లో భారీ సెట్టింగ్స్.. పెద్దపెద్ద లొకేషన్స్.. లాంటివి ప్లాన్ చేయడు.
చాలావరకు.. స్టూడియోలోను, రోడ్ పైన షూటింగ్ కంప్లీట్ చేసేస్తాడు. అవసరమైతే సాంగ్స్ కు సెట్ వేసినా.. వీలైనంత బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేసేస్తాడు. ఇక.. పబ్లిసిటీకి కూడా పెద్దగా ఖర్చు ఉండదు. అది నిర్మాత ఎఫర్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది. మరి.. ఇదే తరహా దర్శకులు టాలీవుడ్ లో మరెవరైనా ఉన్నారా అంటే వినిపించే పేరు.. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దే. సినిమా షూట్ ను ఒకసారి మొదలు పెట్టిన తర్వాత.. పెద్దగా టైం తీసుకోడు. సెట్స్‌పైకి వెళ్లిన వెంటనే స్టార్ల డేట్‌లను బట్టి షూటింగ్ చకచకా చుట్టేస్తాడు. ఎక్కువ డేట్స్ ను కేటాయించి నిర్మాతలపై భారం వేయకుండా.. కథకు అవసరమైనంత మేర ఖర్చు చేస్తాడు. వీలైనంత తక్కువవాలో సీన్స్ కంప్లీట్ చేస్తాడు. దీనికి తగ్గట్టుగానే రెండు విధాలుగా అనిల్ ప్లాన్ చేసుకుంటాడు. అతి వేగంగా షూట్ కంప్లీట్ చేసి.. రిలీజ్ వేగంగా ప్లాన్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్.
తను తీసిన కంటెంట్ తో నిర్మాతలకు కోట్ల రూపాయలు ఆదా చేయగల సత్తా ఉన్న అనిల్.. సినిమా తీయడం ఒక ఎతైతే.. ఆ ప్రాజెక్ట్ జనాల్లోకి తీసుకెళ్లి సినిమాపై హైప్ పెంచడంలో మరింత దిట్ట. కొంతమంది దర్శకులు ప్రచారం పేరుతో కోట్లు ఖర్చు చేస్తారు. కానీ.. అనిల్ మాత్రం ఈ విషయంలోనూ ఎంతో స్మార్ట్. ప్రమోషన్స్ కోసం సినిమాల్లో కాస్టింగ్ను చాలా తెలివిగా ఉపయోగిస్తాడు. సందర్భాన్ని బట్టి రకరకాల ప్లాన్స్ చేస్తాడు. ఇక ఆయననుంచి త్వరలో రానన్నా మన శంకర్ వరప్రసాద్ గారు విషయంలోనూ ఇలాంటి ప్రమోషన్స్ చేయబోతున్నాడట. ఎప్పుడు సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండని నయనతారను సైతం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒప్పించాడంటే ఆయన సమర్థత ఏంటో అర్థం అవుతుంది. సినిమా ప్రారంభం కార ముందే.. ప్రి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూసాం. మెగాస్టార్, నయనతార లాంటి స్టార్లనే రంగంలోకి దింపి ప్రమోషన్స్ చేపించాడంటే.. రిలీజ్ టైం లో ఈ టీం తో ప్రచారం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.



