టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పాలిటిక్స్ తో ఓ పక్క బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాలోని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నుంచి రానున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ షూటింగ్ వీలైనంత త్వరగా ముగించి.. రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే పవన్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుంది.. ఎవరి కాంబోలో పవన్ సినిమా రాబోతుందని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా.. తాజా సమాచారం ప్రకారం పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఓ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌తో మూవీ ఫిక్స్ అయిందని.. అంతే కాదు సినిమాకు ఇంట్రెస్టింగ్ ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లు సినీ సర్కిల్లో టాక్ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. దిల్ రాజు. గతంలో పవన్‌తో వకీల్ సాబ్ సినిమాను రూపొందించిన దిల్ రాజు.. ఇప్పుడు ఆయనతో మరొ క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడట. అంతేకాదు.. వీళ్ళిద్దరూ కాంబోలో రానున్న ఈ సినిమా కోసం అర్జున్ అనే పవర్ ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడుగా ఎవరు వ్యవహరిస్తారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ నిజంగానే పవన్, దిల్ రాజు ప్రాజెక్ట్ పై అఫీషియల్ ప్రకటన వస్తే మాత్రం ఫాన్స్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంటుంది.



