సుకుమార్ యూనివర్స్.. పుష్ప తో చరణ్ కలుస్తాడు.. క్రేజీ ట్విస్ట్..!

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వాళ్లంతా సినిమాటిక్ యూనివర్స్ తో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా అలాంటి ఓ సినిమాటిక్ యూనివర్స్ మూవీ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. చివరిగా సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేసిన పుష్పా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేసిందో.. నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే.

Pushpa 2 director Sukumar to attend Ram Charan's Game Changer event in US -  India Today

ఇక పుష్ప 2తో ఈ రేంజ్‌ సక్సెస్‌ను సుకుమార్ కూడా ఊహించి ఉండరు.కాగా.. ఈ ఫ్రాంఛైజ్‌గా పార్ట్ 3 కూడా రానుందని ఇప్పటికే సుకుమార్ అనౌన్స్ చేస్తాడు. కాగా పుష్ప 3కంటే ముందు రామ్‌చరణ్‌తో సుకుమార్ సినిమా ఫిక్స్ అయింది. ఇప్పటికే చరణ్‌తో రంగస్థలం సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సుకుమార్.. చివరిగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. చరణ్, సుక్కు కాంబోలో రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

Pushpa 3: The Rampage - Movie Synopsis, Cast & Crew | District

కాగా.. ఇప్పుడు చరణ్‌తో సుకుమార్ చేసే సినిమా.. పుష్ప యూనివర్స్ నుంచి వస్తే ఎలా ఉంటుందని డిస్కషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. పుష్ప యూనివర్స్‌లో చరణ్‌ను జస్ట్ ఇమాజిన్ చేస్తేనే ఆడియన్స్‌ లో అంచనాలు ఆకాశానికి అంటుతాయి. ఈ ఆలోచన సుకుమార్‌కు వస్తే ఎలా ఉంటుందని టాక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. పుష్ప.. పుష్ప రాజుగా అల్లు అర్జున్ ఎనర్జీకి మ్యాచ్ చేసేలా.. చరణ్ క్యారెక్టర్‌ను రాసుకొని.. చరణ్ సినిమా చివర్‌లో పుష్ప రాంపేజ్ కి లీడ్ ఇస్తూ.. పుష్ప 3లో చరణ్‌, అల్లు అర్జున్ నటించిన కథ రాస్తే మాత్రం ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సృష్టిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే చరణ్, బన్నీ కాంబోలో ఇలాంటి ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ వస్తే అది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.