టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఉపేంద్ర కీలకపాత్రలో మెరిశాడు. మహేష్ బాబు .పి డైరెక్షన్‌లో ఓ ఫ్యాన్ బై బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. డీసెంట్ అంచనాలతో నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ ఆడియన్స్‌లో ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

చాలా కాలంగా ప్లాప్ లతో సతమతమవుతున్న రామ్ కు ఈ సినిమా హిట్ టాక్ మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో రామ్ పర్ఫామెన్స్, డైలాగ్స్, ఫైట్ సీన్స్ ప్రతి ఒక్కటి ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక.. ఉపేంద్ర సూపర్ స్టార్ రోల్ లో అదరగొట్టడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భాగ్యశ్రీ తన పాత్ర నడివిలో మెప్పించిందట. ఈ క్రమంలోనే.. సినిమా పాజిటివ్ టాక్‌తో సెకండ్ షో నుంచి కలెక్షన్స్ కూడా పుంజుకున్నట్లు తెలుస్తుంది.

సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల కలెక్షన్లు కలగొట్టగా.. ఏపీ, తెలంగాణలో రూ.4.35 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అటు.. ఓవర్సీస్ లో ఫస్ట్ డే 2 లక్షల 75 వేల డాలర్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇక సినిమా రేపటి నుంచి వీకెండ్ కావడంతో మరింత భారీగా కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని చెప్పాలి. ముందు ముందు ఈ సినిమాతో రామ్ ఏ రేంజ్ కలెక్షన్ లో అందుకుంటాడో చూడాలి.

