టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా లెవెల్లో.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు.పి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. యూనిక్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ను పలకరించనుంది. భాగ్యశ్రీ హీరోయిన్గా మెరవనుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆన్ స్క్రీన్ సూపర్ స్టార్ గా కనిపించనున్నారు. ఇక వివేక్ అండ్ మెర్విన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజై చార్జి పోస్టర్లుగా మారాయి. ట్రైలర్ సైతం అదిరిపోయే రెస్పాన్స్ని దక్కించుకుంది.
ఇక నవంబర్ 27 అంటే మరి కొద్ది గంటల్లో సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజా ప్రమోషన్స్ లో ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. కథ వినగానే మా రియాక్షన్ ఏంటి.. అనే ప్రశ్నకు ప్రేక్షకుడిగానే స్టోరీ విన్న, స్టోరీ చెప్పగానే అభిమానులకు కనెక్ట్ అయ్యా.. ఇందులో చాలా మంచి ఎమోషన్ ఉంది.. అందరి లైఫ్ లో ఇలాంటి ఎమోషన్ కచ్చితంగా ఉంటుంది.. అది నాకు చాలా కనెక్ట్ అయింది.. అసలు ఫ్యాన్ లవ్ కు లాజిక్ ఏ ఉండదు.. ఎందుకు అంతలా ప్రేమిస్తారు దానికి మనం అసలు అర్హులమేనా అనిపిస్తూ ఉంటుంది.. అందుకే నేను స్టోరీ కి బాగా కనెక్ట్ అయ్యా అంటూ వివరించాడు.

ఇక ఫ్యాన్స్ తో మీకు మెమొరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా అనే ప్రశ్నకు చాలా ఉన్నాయంటూ కొన్ని సందర్భాలను షేర్ చేసుకున్న ఆయన.. వాళ్ళు అభిమానానికి అవధులే ఉండు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సూపర్ స్టార్ సూర్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. ఓ స్టార్ జీవితం ఎలా ఉంటుందో అలానే ఉంది. ఫ్యాన్స్, క్రేజ్, అప్ అండ్ డౌన్స్, హ్యూమన్ ఎమోషన్స్, లవ్, రిచ్, పూర్ ల మధ్యన ఉండే సంఘర్షణ.. అన్ని కమర్షియల్ యాంగిల్ లో చూపిస్తే అది సూర్య పాత్ర. ఒక స్టార్ కి అలాగే ఫ్యాన్ కి మధ్య ఉండే ఎమోషన్ ని అద్భుతంగా చెప్పారు.. చాలా కొత్తగా అనిపిస్తుంది అంటూ వివరించారు.

ఇక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసిన ఎక్స్పీరియన్స్, అలాగే రామ్ తో తన వర్క్ ఎక్స్పీరియన్స్, భాగ్యశ్రీ తో కాంబినేషన్ సీన్స్ గురించి పంచుకున్నాడు. ఇక మీ డైరెక్షన్లో చిరు గారితో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు కదా.. అనే ప్రశ్నకు అవునండి అది చాలా పెద్ద డ్రీమ్. అన్నీ కుదిరితే కచ్చితంగా చిరంజీవి గారితో సినిమా తీస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీ డైరెక్షన్ లో కొత్త సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు చాలా కథలపై పనిచేస్తున్నాం.. మంచి స్టోరీ ఫైనల్ అయితే అనౌన్స్ చేసేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఉపేంద్ర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


