భాగ్యశ్రీ బోర్సే ప్రేమాలో రామ్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్‌గా రామ్ పోతినేనికి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఈ క్రమంలోనే.. అయన క్రేజ్ కూడా.. మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఇక రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా.. త్వరలోనే ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో రామ్‌.. ఓ స్టార్ హీరో వీరాభిమానిగా కనిపించనున్నాడు. డైరెక్టర్ పి.మహేష్ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాలో.. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెరవనుంది.

Andhra King Taluka' Trailer Launch: Ram Pothineni Celebrates Bhagyashri  Borse's Star Power | - The Times of India

ఇక.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రతి ఒక్కటి ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. ఇక నవంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను తాజాగా మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా రామ్‌ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అలా.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రామ్ ప్రేమాయ‌ణం నడుపుతున్నాడంటూ టాక్ కూడా వైరల్ అవుతుంది.

Photo Moment: Ram Pothineni & Bhagyashri Borse jet off for Vizag's Andhra  King Taluka event

ఇక మూవీ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. తాజాగా ఈ రూమర్లపై రామ్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేసాడు. ఈ సినిమా కోసం నేను ఒక ప్రేమ గీతం రాశౄ.. అప్పటినుంచి రూమర్ మొదలైంది. మనసులో ఏమీ లేకపోతే.. అంత గొప్పగా పాట ఎలా రాయగలరని అందరూ అనుకుంటున్నారు.. కానీ నేను ఈ మూవీలోని హీరో, హీరోయిన్ రోల్స్ ని ఊహించుకొని ఆ లిరిక్స్ రాశా అంతే. ఈ పాట రాసేటప్పటికి.. ఇంకా హీరోయిన్ సెలక్షన్ కూడా జరగలేదు అంటూ వివరించాడు. దీంతో.. వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ప్రేమాయ‌ణం వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక.. మరికొద్ది గంటల్లో.. రిలీజ్ కానున్న.. ఆంధ్ర కింగ్‌ తాలూకా సినిమా సక్సెస్.. రామ్‌కు చాలా కీలకం. ఈ క్రమంలోనే.. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.