‘ అఖండ 2 ‘ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో కన్నీళ్లు ఆగవు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అఖండ 2 తాండవం సినిమా ఎట్టకేలకు ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే పీక్స్ లెవెల్ అంచనాలు నెల‌కొన్నాయి. ఈసారి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హిందీ, తమిళ్ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అఖండ 2 టీం ప్లాన్ చేశారు. ఇక్కడ అన్నిటికంటే బిగ్ ట్విస్ట్ బాలయ్య స్వయంగా ఈ భాషలన్నింటికీ డబ్బింగ్ చెప్పుకున్నారు.

ఇక కొద్ది గంటల క్రితమే సినిమాకు సంబంధించిన థియేట్రిక‌ల్‌ ట్రైలర్ రిలీసై మిక్స్డ్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది. అభిమానులకు ట్రైలర్ గూస్‌బంప్స్‌ తెప్పించినా.. సాధారణ ఆడియన్స్ మాత్రం అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉన్నాయని.. మ్యూజిక్ కూడా చాలా లో క్వాలిటీగా అనిపిస్తుందని.. ఇక గ్రాఫిక్స్ కూడా చాలా నాసి రకంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో.. సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. నిన్న ఈ సినిమా ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసిన టీం.. ప్రసాద్ ల్యాబ్స్‌లో వేశారు. ఇందులో భాగంగా బాలయ్య, మూవీ టీం తో పాటు.. కొంతమంది మీడియా ప్రముఖులు సినిమా వీక్షించారట. వాళ్ళ నుంచి లీకైన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ నుంచి సినిమా అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని రీచ్ అయ్యేలా సినిమాను తెరకెక్కించారని.. ఇక ఫైట్ సీన్స్ అయితే అఖండ ను నుంచి పోయే రేంజ్ లో ఉన్నాయని.. పాటలు కచ్చితంగా ఆకట్టుకుంటాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సినిమాలో సాంగ్స్ కు బాలయ్య నుంచి డ్యాన్స్ స్టెప్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుందని.. మదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుందని.. అదే టైంలో బాలయ్య – కూతురు సెంటిమెంట్ కూడా బాగుందంటూ చెబుతున్నారు.

చావుకు దగ్గరగా ఉన్న తల్లి తన పెద్ద కొడుకు చితి పెడితే కానీ ప్రాణాలు వదలనని చెప్పే ఎమోషనల్ సీన్స్.. తల్లి కోసం చిన్న బాలయ్య చేసే ప్రయత్నాలు.. ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయని.. ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తాయని అంటున్నారు. ఇక.. చిన్న బాలయ్య కుటుంబం మొత్తం హిమాలయాల్లో ఉన్న అఖండ కోసం వెతకడం ప్రారంభిస్తారట‌. ఈ క్రమంలోనే హిమాలయాల్లో వాళ్ళ ప్రయాణం.. అక్కడ జరిగే సంఘటనలు కచ్చితంగా అందరికీ నచ్చుతాయని.. అంతేకాదు మాస్ ఆడియన్స్‌కు కచ్చితంగా నచ్చే సినిమా అంటూ చెప్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న క్ర‌మంలో బ్రేక్ ఈవెన్ కావాలంటే కేవలం ఒక టాలీవుడ్ లోనే కనీసం రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాల్సి ఉంది. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ అందుకుంటుందో.. బ్రేక్ ఈవెన్ టచ్ చేసి హిట్ కొడుతుందో లేదో చూడాలి.