బాలయ్య ” అఖండ 2 ” కు బిగ్ టార్గెట్.. ప్లాన్ అదుర్స్..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నోట ఈ సినిమా పేరు వినిపిస్తుంది. కారణం తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్. ఆడియన్స్‌లో ఈ ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. శుక్రవారం రాత్రి బెంగళూరులోని.. చిక్కబడ్పురంలో ఈ ట్రైలర్‌లాంచ్‌ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఇక.. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హ‌జ‌ర‌య్యారు. ఇందులో భాగంగానే.. ఈవెంట్‌లో మరింత సందడి వాతావరణం నెలకొంది. బాలయ్యతో పాటు.. శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఈవెంట్‌లో సందడి చేశారు.

ఇక.. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. అభిమానులకైతే గూస్‌బంప్స్ తెప్పించింది. ఆఖండ 2తో మరోసారి బాలయ్య థియేటర్లలో రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. బాలయ్య మెయిన్ టార్గెట్ ఏంటో కూడా చెప్పకనే చెప్పేశాడు. ఆయన మాట్లాడుతూ.. సమాజపు మూలాలను, హైందవ ధర్మాన్ని అఖండ 2 మూవీ సరికొత్తగా ఆవిష్కరించనుందని.. నేను నటించే ప్రతి సినిమాలా అఖండ 2లో కూడా సమాజానికి, యువతకి ఉపయోగపడే సందేశం ఒకటి ఉంది అంటూ వివరించాడు.

Balakrishna's 'Akhanda 2: Tandavam' triumph ahead

అఖండ 2.. కన్నడ, తెలుగు సినిమా కాదని.. ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియన్ మూవీ అంటూ వివరించాడు. ఈ క్రమంలోనే బాలయ్య మాటల్లో అఖండ 2 మెయిన్ టార్గెట్ హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ.. యూత్ పై ఇంపాక్ట్ పడేలా చూపించాడ‌ని అర్థమవుతుంది. ఇటీవల కాలంలో హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. అందుకే బాలయ్య మళ్ళీ అఖండ 2 తో రికార్డులు బద్దలు కొట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ మూవీ అంటే ఏ రేంజ్ లో మాస్ ఉంటుందో చెప్పనవసరం లేదు. అయితే అఖండ 2 ఆడియన్స్ అంచనాలను మించిపోయేలా ఉంటుందని.. ఇప్పటికే మేకర్స్‌ స్ట్రాంగ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చి సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమాపై అంచనాలు ఆకాశానికి అందాయి. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.