తెలుగు సినిమాను ప్రపంచ వేదికకు పరిచయం చేసిన ఘనత టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికే దక్కుతుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న జక్కన్న.. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను గ్లోబల్ ట్రోటర్ పేరుతో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశాడు. ఇక ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించారు. కాగా.. ఈవెంట్ టైంలో రాజమౌళి మాట్లాడుతూ.. దేవుడు అంటే నాకు నమ్మకం లేదని చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. రాజమౌళి కామెంట్స్ తో కొందరు రంగంలోకి దిగి.. ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
దీనిపై తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. జక్కన్నకు సపోర్ట్ చేస్తూ విమర్శించే వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్స్ వేశాడు. రాజమౌళి చేసిన కామెంట్స్ లో అసలు తప్పు లేదని.. నాస్తికుడిగా ఉండడంలో తప్పు ఉండదు అంటూ చెప్పుకొచ్చిన ఆర్జీవి.. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 గురించి గుర్తుచేస్తూ ఎవరి మతవిశ్వాసం వాళ్లకు ఉంటుంది.. దేవుడిని నమ్మడం ఒకరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కనుక.. రాజమౌళి దేవుడిని నమ్మనని చెప్పడంలో తప్పేమీ లేదు. అతనిపై అనవసరంగా అదే పనిగా విషం చల్లుతున్నారంటూ ఆర్జీవి ఫైర్ అయ్యాడు. దేవుడంటే నమ్మకం లేనప్పుడు.. సినిమాలో దేవుడు ప్రస్తావన ఎందుకు వస్తుందని గత కొంతకాలంగా బిజెపి నాయకులు రాజమౌళి పై కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఆర్జీవి వాటిపై రియాక్ట్ అవుతు.. ఇలాంటివన్నీ కొందరి పసలేని వాదనలు. ఆ లాజిక్ ప్రకారం చూస్తే గ్యాంగ్స్టర్ సినిమా చేసే దర్శకుడు గ్యాంగ్ స్టార్ అయి ఉండాలా.. హారర్ సినిమా చేసేవాడు దెయ్యం అయిపోవాలి అంటూ ప్రశ్నించాడు.
రాజమౌళి దేవుడిని నమ్మకపోతే ఏం.. అదే దేవుడు అతనికి 100 కోట్ల సక్సెస్, సంపాదన, తనను ఆరాధించే అభిమానులను ఇచ్చాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దేవుడిని మేము నమ్ముకున్నామని చెప్పే మేధావులు.. వంద జన్మలు ఎత్తిన అలాంటి పేరు సంపాదించుకోలేరని.. తనదైన స్టైల్ లో వర్మ కౌంటర్లు వేశాడు. దేవుని నమ్మే వాళ్ళ కంటే.. ఆయనను నమ్మని వాళ్ళని భగవంతుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని.. దేవుడు అసలు ఇలాంటి విషయాలను పట్టించుకోడని వర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. పుస్తకంలో ఎవరు నమ్ముతారు.. ఎవరు నమ్మరు అనే వారి పేర్లు రాయడమే పనిగా దేవుడు పెట్టుకోలేదని.. సెటైర్లు వేశాడు.

ఇక దేవుని నమ్మే వాళ్ళు బీపీలు, అల్సర్‌లతో ఎందుకు అల్లాడిపోతున్నారు అంటూ సూటి ప్రశ్న సంధించాడు. ఇక దేవుని నమ్ముతున్నామని చెప్పుకునే పెద్ద మనుషులు.. సమస్య నాస్తికత్వం కాదు. దైవాన్ని నమ్మకపోయినా రాజమౌళి లాంటి వాళ్లు సక్సెస్ సాధించడం. వాళ్ళ సమస్య ఓర్వలేనితనం అంటూ తేల్చి చెప్పేశాడు. 24 గంటలు భక్తితో పూజలు చేసిన వాళ్ళు పైకి ఎదగలేకపోతున్నారని అసహనం అంటూ బండిపడ్డాడు. మొత్తానికి ఇది దేవుడిపై, భగవంతుడిపై.. భక్తు లేదా విశ్వాసము కాదు. కేవలం అసూయతోనే వీళ్లంతా జక్కనపై విషయం కక్కుతున్నారంటూ తన ట్విట్‌ను ముగించాడు. ప్రస్తుతం వర్మ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.


