చరణ్ కు ఆ మూవీ అంటే పిచ్చి.. క్యాసెట్ వేస్తే గాని అన్నం తినేవాడు కాదు.. చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నటవరసత్వం అన్న పేరు మాత్రమే చరణ్‌కు చిరు నుంచి దక్కింది. తర్వాత ఆయన ఎదుగుదల అంతా స్వయంకృషితోనే. పరిశ్రమలో తన‌ను తానే నిర్మించుకుంటూ.. చిన్న సినిమాలతో మొద‌లై రీజ‌న‌ల్ స్టార్ నుంచి.. పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో.. గ్లోబల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా తనను అందంగా చెక్కుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని.. తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు.

కాగా.. చరణ్ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగినా.. ఆ ప్రభావం ఆయ‌న‌ పై కనపడకూడదని చిరంజీవి భావించేవాడట. ఈ క్రమంలోనే ఇంట్లో ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉండేవాడని.. సినిమా షూట్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆ విషయాన్ని పెద్దగా ఇంట్లో మాట్లాడేవాడు కాదని.. పిల్లలకు సినిమాల కంటే చదువు ముఖ్యమని దానిపై శ్రద్ధ ఉండేలా చూసుకునే వారిని ఇప్పటికే చాలా సందర్భాల్లో రివిల్ అయింది. కాగా.. చరణ్ కి మాత్రం మొదటినుంచి చదువు పెద్దగా ఎక్కలేదట.. కాలేజీ డుమ్మా కొట్టి మరీ.. తెగ షికార్లు కొట్టేవాడని.. మద్రాసులో ఉన్నప్పుడు ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేశాడని చ‌ర‌ణ్ స్వ‌యంగా వివరించాడు.

Kodama Simham Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

కాగా.. తాజాగా చరణ్‌కు సంబంధించిన మరో క్రేజీ మ్యాటర్‌ను చిరంజీవి ఇటీవల రివీల్ చేశాడు. చరణ్ చిన్నప్పుడు చిరంజీవి నటించిన ఓ సినిమాను ఎంతగానో ఇష్టపడేవాడట. ఆ సినిమా ప్లే చేస్తే కానీ అన్నం కూడా తినేవాడు కాదట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించాడు. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. కొదమసింహం. ప్రతిసారి అదే సినిమా పెట్టమని సురేఖ దగ్గర మారం చేసేవాడని.. తనకంటే కొదమ సింహం సినిమా చరణ్‌కు ఎక్కువగా ఇష్టమని.. అందులో కౌబాయ్ రోల్‌ అంటే చరణ్‌కు చాలా ఇష్టపడేవాడు అంటూ వివరించాడు. చిరంజీవి కొదమసింహం రిలీజై ఇప్పటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో.. మెగాస్టార్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేశారు.