టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా.. ప్రభాస్ కెరీర్‌లోనే సరికొత్త జానర్ కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో బజ్ ఆడియన్స్లో మొదలైంది.
ఇక ఈ సినిమా జనవరి 9, 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మమమేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రాజసాబ్ మొదట ఓవర్సీస్ లో సెన్సేషన్స్ సృష్టించబోతుందట. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి నార్త్ అమెరికాలో రాజాసాబ్‌కు విపరీతమైన డిమాండ్ నెలకొందని.. ఈ క్రమంలోనే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేక ప్రీమియర్ షో లను వేసేందుకు ప్లాన్‌లు కూడా చేసినట్లు సమాచారం.

2026, జనవరి 8న ఈ మూవీ ప్రీమియర్ షోస్ పడిపోతాయట. వాటికోసం.. టికెట్ బుకింగ్ డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్‌తో ఇటీవల అఫీషియల్గా వెల్లడించారు. ఈ అనౌన్స్మెంట్తో మాత్రం ప్రభాస్ ఓవర్సిస్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది. దీంతో రిలీజ్‌కు ముందే రాజాసాబ్ హంగామా మొదలైపోయింది. ఇక బుకింగ్స్ మొదలైన తర్వాత.. అక్కడ ఏ రేంజ్‌లో సెన్సేషన్స్ క్రియేట్ అవుతాయో చూడాలి.


